Kamal Hasan: సినిమా స్కూల్‌కు త్రిష కుమార్తెతో కలిసి వెళతా..
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:48 PM
సినిమా అనే స్కూల్‌కు హీరోయిన్ త్రిష(Heroine Trisha)తోనే కాదు ఆమె కుమార్తెతో కూడా కలిసి వెళతానని అగ్రనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Hasan) సరదాగా వ్యాఖ్యానించారు.

- హీరో కమలహాసన్
చెన్నై: సినిమా అనే స్కూల్‌కు హీరోయిన్ త్రిష(Heroine Trisha)తోనే కాదు ఆమె కుమార్తెతో కూడా కలిసి వెళతానని అగ్రనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Hasan) సరదాగా వ్యాఖ్యానించారు. నగరంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కమల హాసన్‌తో కలిసి త్రిష కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘థగ్‌లైఫ్’ మూవీలో కమల్‌తో కలిసి నటించిన అనుభవంపై త్రిష స్పందిస్తూ.. ‘‘థగ్‌లైఫ్’ చిత్రంలో నటించడం గొప్ప అనుభవంగా భావిస్తున్నాను.
ఈ వార్తను కూడా చదవండి: NCTE: మళ్లీ ఒక ఏడాది బీఈడీ, ఎంఈడీ!
ఆయన వద్ద అనేక విషయాలు నేర్చుకున్నాను. కమల్‌తో కలిసి ఒక పాఠశాలకు వెళ్ళిన అనుభూతిని పొందాను. ఆ స్కూల్‌లో అనేక విషయాలు తెలుసుకున్నాను’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమల్ స్పందిస్తూ.. ‘నిజమే.. నేను త్రిష(Trisha)తో కలిసి స్కూల్‌కు వెళ్ళాను. అక్కడ అనేక విషయాలు నేర్చుకున్నాం. గురుస్థానం అనేది నాకొద్దు. అది దివంగత కె.బాలచందర్‌తోనే ఉండిపోనివ్వండి.
నేను ఎల్లవేళలా ఒక విద్యార్థిగానే ఉండేందుకు ఇష్టపడతాను. త్రిషతో కలిసి స్కూలుకు వెళ్ళా ను. ఆ తరువాత ఆమె కుమార్తెతో కూడా పాఠశాలకు వెళతాను. సినిమా అనేది చాలా పెద్దది. నేను 5వ తరగతి వరకు మాత్రమే నేర్పించగలను. పీహెచ్‌డీ స్థాయికి నేను నేర్పించలేను. సినిమా అనేది అనేక విషయాల సమ్మేళనం’ అని పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News