Actor Kamal Hasan: 20 యేళ్లు లేటుగా వచ్చా... అదే నా తొలి ఓటమి
ABN , Publish Date - Feb 22 , 2025 | 01:47 PM
రెండు దశాబ్దాలకు ముందే రాజకీయ ప్రవేశం చేసి ఉంటే తానెంతో ఉన్నత స్థితిలో ఉండేవాడినని, ఆ సమయంలో వెనుకంజ వేయటమే తన మొదటి ఓటమి అని మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, సినీనటుడు కమల్‌హాసన్(Film actor Kamal Haasan) అన్నారు.

ఈ యేడాది పార్లమెంట్‌లో పార్టీకి స్థానం
ఎంఎన్‌ఎం వార్షికోత్సవ సభలో కమల్
చెన్నై: రెండు దశాబ్దాలకు ముందే రాజకీయ ప్రవేశం చేసి ఉంటే తానెంతో ఉన్నత స్థితిలో ఉండేవాడినని, ఆ సమయంలో వెనుకంజ వేయటమే తన మొదటి ఓటమి అని మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, సినీనటుడు కమల్‌హాసన్(Film actor Kamal Haasan) అన్నారు. పార్టీ ఎనిమిదో వార్షికోత్సవం శుక్రవారం ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ పయనంలో అభిమానులు వేరు, ఓటర్లు వేరు అని గ్రహించగలిగానని, చివరి ఓటరు ఉన్నంతవరకూ తమ పార్టీ సేవలు కొనసాగిస్తానన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Actor Vijay: నెల తిరక్కమునుపే జిల్లా నేతలపై చర్యలు..
ఇరవై ఏళ్ల క్రితం తాను రాజకీయ ప్రవేశం చేసి ఉండాలని, అప్పట్లో తగు నిర్ణయం తీసుకుని ఉంటే తాను రాజకీయాల్లో ఉన్నతస్థితిలో ఉండేవాడినన్నారు. రాష్ట్ర ప్రజలందరినీ సమైక్యపరిచేది తమిళ భాషేనని, తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోతుండటానికి కారణం తమిళ ప్రజలేనని చెప్పారు.
ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తమిళభాషను ఎవరూ కిందకు దించలేరని ఆయన చెప్పారు. ఈ యేడాది పార్లమెంట్‌లో పార్టీ వాణి తొలిసారిగా వినిపిస్తుందని, వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ సభ్యులుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులంతా ప్రజలకు తోచినంత సేవ చేస్తూ ఉండాలని, అప్పుడే పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని కమల్ పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News