Home » Karimnagar
కరీంనగర్లోని మల్టీపర్పస్ పార్కు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆరు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో పార్కు పనులు చేపడుతున్నారు. నవంబరులో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు.
Telangana: పొంగులేటి బాంబులపై మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఒరిజనల్ బాంబులకే భయపడలేదు.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
Telangana: తెలంగాణలో పోలీసు భార్యలు ధర్నాకు దిగడం హాట్ టాపిక్ మారింది. తమ భర్తలతో వేరే పనులు చేయిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. మా భర్తలను కుటుంబానికి దూరం చేస్తున్నారంటూ పోలీసు భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్లలో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ బయలుదేరనున్నారు.
జగిత్యాల: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి (58) దారుణ హత్య కేసులో పోలీసులు నిందితుడి నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులతో నిందితుడికి ఉన్న సంబంధాలపై విచారణ జరుగుతోంది. నిన్న (మంగళవారం) పోలీసుల వైఫల్యంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఆరోపణలు చేశారు.
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికలో పది మంది వరకు అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. వారంతా కొత్త పట్టభద్రుల ఓట్లను నమోదు చేసే పనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.
Telangana: మారు గంగారెడ్డి హత్యపై ఎమ్మెల్యే సంజయ్ ఆరా తీశారు. జగిత్యాల ఎస్పీకి ఎమ్మెల్యే ఫోన్ చేసి హత్య గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని ఆదేశాలు జారీ చేశారు.
జాబితాపూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి(58) ఉదయం పని నుంచి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే కొన్ని రోజులుగా అతణ్ని చంపేందుకు పథకం రచించిన గుర్తుతెలియని దుండగలు.. ఇవాళ ఉదయం గ్రామానికి చేరిన కాంగ్రెస్ నేత గంగారెడ్డిని ఒక్కసారిగా కారుతో ఢీకొట్టారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు, జమున దంపతులకు ఉక్కులు(5) అనే కుమార్తె ఉంది. ఏకైక సంతానం కావడంతో బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో కరీంనగర్ అధికారుల్లో కదలిక వచ్చింది. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి వైద్య బృందాన్ని పంపించారు.