Share News

రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వ పాలన

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:52 PM

అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఏజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వ పాలన

మంథని, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఏజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ జయంతి రోజు మంథనిలో రూ. కోటితో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్‌ ఆలోచన విధానంతో పేద సంక్షేమం ప్రధాన ఏజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా దేశం ఆవిర్భవించడానికి అంబేద్కర్‌ కీలక పాత్ర పోషించాడన్నారు. అట్టడుగు వర్గాల్లో జన్మించి ప్రపంచ మేధావిగా ఎదిగి దేశ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించాడన్నారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, 15 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. రూ. 200 కోట్లతో అడవిసోమన్‌పల్లి వద్ద యంగ్‌ ఇండియా గురుకుల పాఠశాల పనులు చురుకుగా కొనసాగుతున్నాయ న్నారు. నాయకులు ఐలి ప్రసాద్‌, శశిభూషణ్‌కాచే, వొడ్నాల శ్రీనివాస్‌, పెండ్రు రమ-సురేష్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్‌, కొండ శంకర్‌, ముస్కుల సురేందర్‌రెడ్డి, కుడుదుల వెంకన్న, పేరవేన లింగయ్యయాదవ్‌, సెగ్గెం రాజేష్‌, మంథని లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, ఎరుకల ప్రవీణ్‌, తోకల మల్లేష్‌, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:52 PM