Home » Kesineni Nani
వైసీపీ నేత కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కేశినేని నాని ఆస్తులు.. అప్పుల లెక్కలు మీడియాకు విడుదల చేశారు. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని.. అప్పులు తగ్గించుకున్నారని ఆరోపించారు.
Andhrapradesh: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మరోసారి ఫైర్ అయ్యారు. తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ బుద్దా వెంకన్న గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. నానికి మతి భ్రమించిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని నానికి విశ్వాసం లేదని చిన్ని మండిపడ్డారు. వైసీపీలో నాని చేరడంతో.. సైకోలు అందరూ ఒకే చోట చేరారని విమర్శలు గుప్పించారు.
Andhrapradesh: విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరాక తెలుగుదేశంపై అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలంటూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనే నాని సవాల్ విసిరారు. ఈ క్రమంలో టీడీపీపై కేశినేని నాని వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేశినేనిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తాజాగా ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు.
MP Kesineni Nani Issue: ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్‌బై చెప్పినా ఆయన అనుచరులు ఎవ్వరూ ఆయనతో కలిసి అడుగులు వేయలేదు. ఇది ఓ రకంగా చూస్తే టీడీపీ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంత బలంగా ఉందో చెప్పే అంశంగా కనిపిస్తోంది. కానీ..
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కే అంటే కేశినేని నాని కాదు.. కోవర్టు అని ధ్వజమెత్తారు. మాజీ లోక్ సభ స్పీకర్, దళిత నేత జీఎంసీ బాలయోగి ఆస్తులను కాజేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్చార్జి బుద్దా వెంకన్న ఆసక్తికర ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక కోవర్ట్ అంటూ విమర్శలు గుప్పించారు.
Andhrapradesh: ‘‘నా సమర్ధత గురించి ఎంపీ కేశినేని నాని మాట్లాడటం హాస్యాస్పదం’’ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మెజారిటీ పెంచుకున్న తాను సమర్థుడినో, ఓట్ల శాతం తగ్గిన కేశినేని నాని సమర్థుడో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి వైసీపీ కోవర్టుగా పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. 2017లో టీడీపీలో చేరేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించారని వెంకన్న తెలిపారు. టీడీపీలో చేరొద్దని కేశినేని నాని చెప్పారని తర్వాత తెలిసిందని తెలిపారు.