Share News

Prof Kodandaram: తెలంగాణ ప్రజల త్యాగానికి అర్థం లేకుండా పోతుంది

ABN , Publish Date - Jan 19 , 2025 | 05:09 PM

Prof Kodandaram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే ప్రజలకు జరిగే ఆ కాస్త న్యాయం కూడా జరిగేలా లేదని ఎమ్మెల్సీ కోదండరాం అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ప్రత్యేక తెలంగాణ కోసం.. ఆ రాష్ట్ర ప్రజల చేసిన త్యాగానికి సైతం అర్ధం లేకుండా పోతుందని ఆయన ఆవేదన చెందారు.

Prof Kodandaram: తెలంగాణ ప్రజల త్యాగానికి అర్థం లేకుండా పోతుంది
Prof Kodandaram

సూర్యాపేట, జనవరి 19: గత కేసీఆర్ పాలనలో తప్పులు జరిగాయని ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం విమర్శించారు. ఎవరూ ప్రశ్నించొద్దంటే కుదరని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తప్పులు చేసి అధికారం దుర్వినియోగం చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆదివారం సూర్యాపేటలో ప్రొ. కోదండరాం మాట్లాడుతూ.. పన్ను రూపంలో ప్రజలు కడుతోన్న సొత్తును జాగ్రత్తగా ఖర్చు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎలా ఉంటారన్నారు. ప్రజలకు సంక్షేమం కావాలంటే ఆంక్షలు, పాలకులు అనుభవించాలంటే నిబంధనలు ఉండొద్దన్నట్లుగా ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్సీ, ప్రొ. కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అడ్డగోలు సంపాదనలకు రాజ్యాంగం అడ్డొస్తుందని పాలకులు భావిస్తున్నారని.. అందుకే వాటిని మార్చాలని వారు అనుకోంటున్నారని ఆయన విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే ప్రజలకు జరిగే ఆ కాస్త న్యాయం కూడా జరిగేలా లేదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ప్రత్యేక తెలంగాణ కోసం.. ఆ రాష్ట్ర ప్రజల చేసిన త్యాగానికి సైతం అర్ధం లేకుండా పోతుందని ఆయన ఆవేదన చెందారు. అమరుల త్యాగ ఫలం ఫలించాలంటే ప్రజలు ఆశించిన సంక్షేమం అందాల్సి ఉందన్నారు. తెలంగాణా అమర వీరుల ఆకాంక్షల మేరకే పాలన జరగాలని ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం పేర్కొన్నారు.


2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అయింది. అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఓటరు నాటి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాడు. ఇక 2019 ఎన్నికల్లో సైతం అదే పార్టీకి మరో సారి ఓటరు ఛాన్స్ ఇచ్చాడు. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలు. అలాగే ఆయన పాలన, ఆయన కేబినెట్‌లోని మంత్రుల వ్యవహార శైలి, టీఆర్ఎస్ పార్టీ కాస్తా.. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందడడం.. ఆ క్రమంలో దేశంలో తృతీయ ఫ్రంట్ కోసం కేసీఆర్ చక్రం తిప్పేందుకు అడుగు వేయడం.. ఇక కేసీఆర్ పాలనలో ప్రజా రవాణా కోసం కేటాయించిన ఆర్టీసీ బస్సులకు తీవ్రంగా కోత పెట్టడం.. వాటిని కార్గో సేవలకు ఉపయోగించడం.. దీంతో హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి 9.30 గంటలు అనంతరం సిటీ బస్సులు సైతం లేకపోవడం..

Also Read: ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

Also Read: శుభలేఖలు పంచుతూ.. మృతు ఒడిలోకి..


అలాగే నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం.. కేసీఆర్ పాలనపై గళమెత్తిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడం.. ఇక ప్రజల్లో సైతం బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమైనా.. దీనిని గత పాలకులు ఏ మాత్రం పట్టించుకోక పోవడం..అలాగే కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని వెచ్చించి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం.. పిల్లర్లలో పగుళ్లు ఏర్పడడం.. హైదరాబాద్ నడి బొడ్డున శుభ్రంగా ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి.. కొత్తది నిర్మించడం తదితర అంశాలను కారు పార్టీ అధినేత కేసీఆర్‌ను పుట్టి ముంచేందుకు దోహదం చేశాయని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషించారు.

For Telangana News And Telugu News

Updated Date - Jan 19 , 2025 | 05:10 PM