బ్రేకింగ్: ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 6 మంది మృతి
ABN , Publish Date - Mar 30 , 2025 | 07:27 PM
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొండచరియల కింద ఉన్న మృతదేహాల కోసం పోలీసులు తవ్వకాలు చేపట్టారు.

ఉత్తర భారతదేశంలో కొండచరియలు విరిగిపడుతున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అభంశుభం తెలియని వాళ్లు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొంతమంది రోడ్డు పక్కన నిల్చుని ఉన్నారు. వారిలో తినుబండారాలు అమ్ముకునే వ్యక్తి, కారు డ్రైవర్,ముగ్గురు టూరిస్టులు ఉన్నారు.
కొద్ది సేపటి తర్వాత కొండచరియలు విరిగాయి. ఓ పెద్ద చెట్టు కొండచరియలతో పాటు కూలి, కింద రోడ్డు మీద ఉన్న వారిపై పడింది. మొత్తం ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పతికి తరలించాయి. పోలీసులు మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో తవాంగ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడి ఏకంగా 16 మంది చనిపోయారు. చనిపోయిన వారంతా భవన నిర్మాణ కార్మికులు కావటం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
వంట విషయంలో గొడవ.. పక్కా ప్లాన్‌తో లేపేశాడు..
Gold Rate: నిజంగా పండగలాంటి వార్తే.. రూ.55 వేలకు దిగిరానున్న బంగారం ధర