Home » Lok Sabha Elections
ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి జరుగుతున్నవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యానించారు. ఇవి సాధారణ ఎలక్షన్లు కావని.. మంగళవారం జరుగుతున్న మూడో దశ పోలింగ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
దేశంలో ఎన్నికల వేళ తప్పుడు ప్రచారంతో కొన్ని పార్టీలు, కొంత మంది వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు ఇతర పార్టీలపై బురద జల్లేందుకు ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలను సామాజిక మాద్యమాల్లో వ్యాప్తిచేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు కావడంతో భారతీయ పౌరసత్వం ఉన్న వ్యక్తి దేశంలో ఏ లోక్‌సభ స్థానంలో అయినా పోటీ చేయవచ్చు. మరోవైపు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి స్థిరపడిన వ్యక్తులు అక్కడి రాజకీయాల్లో రాణిస్తున్నవారెందరో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఇతర రాష్ట్రాల్లో రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం అందరిదృష్టిని ఆకర్షించింది.
ఓట్ల పండుగ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పండుగ ఎన్నికలు.. ఏడు దశల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎంతోమందికి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఓటర్లకు సహజంగా వచ్చే అనుమానాలు కొన్ని అయితే.. ఈవీఎంలపై రాజకీయ పార్టీల ఆరోపణలతో మరిన్ని అనుమానాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఈవీఎం ఎలా పనిచేస్తుంది. మనం వేసిన ఓటు వేసిన పార్టీకే పడుతుందా.. వేరు పార్టీకి పడుతుందా..
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతలకు గానూ మూడో విడత పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ, కాంగ్రెస్‌లను భయం వెంటాడుతోంది. మూడో దశలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో 2014, 2019లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈ విడతలో ఎక్కవ స్థానాలు గెలవాల్సి ఉంటుంది.
మూడో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 3 వ ఫేజ్‌లో 12 రాష్ట్రాలు, యూటీలలోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం (4), బీహార్ (5),ఛత్తీస్ ఘడ్(7),దాద్రా నగర్ హవేలీ ,డామన్ & డయ్యు,(2) గోవా (2) గుజరాత్(26), కర్ణాటక(14) మహారాష్ట్ర(11),ఉత్తరప్రదేశ్ (10),వెస్ట్ బెంగాల్ (4),మధ్యప్రదేశ్ (8) రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.
ఒడిశాలో(Odisha) రెండు యాగలు జరుగుతున్నాయని.. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేయడానికి, మరోటి రాష్ట్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ(PM Modi) సోమవారం బెహ్రంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా పది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాలకు మంగళవారం (మే7న) పోలింగ్ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
పార్టీ ఎమ్మెల్యేకు బీజేపీ(BJP) నోటీసులివ్వడం ఉత్తరప్రదేశ్(UP) రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యే కుమారుడు, పార్టీ బహిష్కృత నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటమే నోటీసులు పంపడానికి కారణంగా తెలుస్తోంది. యూపీ ఫతేపూర్ సిక్రీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి కుమారుడు రామేశ్వర్ చౌదరి అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రసంగంలో భాగంగా పప్పులో కాలేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేయబోయి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై నోరుజారారు.