Mallareddy controversy: మరోసారి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏకంగా హీరోయిన్‌పై..
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:48 AM
హీరోయిన్ కసీ కపూర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ వచ్చానంటూ మల్లారెడ్డి చెప్పడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా సినిమా ఈవెంట్లకు హాజరుకావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన మల్లారెడ్డి హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ పేరు కసీ కపూర్ అంట.. ఆమె మాత్రం కసికసిగా ఉందంటూ నోరు పారేసుకున్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యలతో ఈవెంట్‌కి వచ్చిన ప్రేక్షకులంతా పగలపడి మరీ నవ్వారు. ఆ సినిమా హీరో సైతం నవ్వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగానూ పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. చట్టసభల్లో ఉండే వ్యక్తులు మహిళల గురించి ఇలా మాట్లాడడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. మల్లారెడ్డి నోరు జారడం కొత్తేమీ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.
మల్లారెడ్డి అసలేమన్నారంటే..
సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే మల్లారెడ్డిని నిర్వాహకులు స్టేజ్ పైకి ఆహ్వానించారు. స్టేజ్ పైకి వెళ్లిన ఆయన మైక్ తీసుకుని మాట్లాడడం ప్రారంభించారు. హీరోయిన్ ప్రస్తావన వచ్చినప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. "హీరోయిన్ పేరు కసీ కపూర్ అంట.. కసికసిగా ఉంది. ఈ సినిమా హీరో మా స్టూడెంట్. మా స్టూడెంట్ హీరో కావడం సంతోషంగా ఉంది. అతను ఇక్కడే చదివాడు, ఇక్కడే హీరో అయ్యాడు, ఇక్కడే సినిమా ప్రమోషన్ కూడా జరుగుతోంది. చాలా సంతోషం. అదే మాదిరిగా హీరో ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీ ప్రిన్సిపల్. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన నన్ను రమ్మని పిలిచేవారు, కానీ నాకు కుదరలేదు. ఈ రోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి మరీ ఆయన కోసం వచ్చానని" చెప్పారు.
హీరోయిన్ కసీ కపూర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ వచ్చానంటూ మల్లారెడ్డి చెప్పడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా సినిమా ఈవెంట్లకు హాజరుకావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రతి పక్షంలో ఉన్న మీరు రాష్ట్ర సమస్యలపై గళమెత్తకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదంటూ మండిపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..
Stored Water: ఆ నీటిని వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు రావడం ఖాయం..