Home » Mamata Banerjee
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బుధవారం ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. సందేశ్ ఖాళి లోక్ సభ నియోజకవర్గంలో గల బరాసత్ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సభకు భారీగా మహిళలు వచ్చారు.
బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.
లోక్ సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, బరానగర్ ఎమ్మెల్యే తపాస్ రాయ్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవీతోపాటు, పార్టీకి రాజీనామా సమర్పించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ సుదీప్ బెనర్జీని అరెస్ట్ చేయాలని ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. కోల్ స్కామ్ కేసులో సుదీప్ బెనర్జీ హస్తం ఉందని కునాల్ ఘోష్ ఆరోపించారు. కోల్ స్కామ్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ సరైన దిశలో ముందుకెళ్లడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెంగాల్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై (దీదీ) భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సమయానికి అనుకూలంగా నడుచుకోవడంతో దీదీ నంబర్ వన్ అని మండిపడింది.
రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిసారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిల అంశాన్ని ఈ సమావేశంలో మోదీ దృష్టికి మమత తీసుకువచ్చారని తెలుస్తోంది.
సందేశ్‌ఖాలీకి(Sandeshkhali) చెందిన నేరస్థుడు, టీఎంసీ నేత షేక్ షాజహాన్‌ను కాపాడేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రయత్రిస్తోందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన ఆరోపణలు చేశారు.
ఒకవేళ బీజేపీ (BJP) మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ తప్పకుండా వంట గ్యాస్ సిలిండర్ల (Cooking Gas Cylinders) ధరలను గణనీయంగా పెంచే అవకాశం ఉందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) గురువారం అభిప్రాయపడ్డారు. మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. సిలిండర్ల ధర రూ.2000 పెరగొచ్చని పేర్కొన్నారు.
సందేశ్‌ఖలి ఘటన సందర్భంగా సొంత పార్టీ నేతలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. "గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌లలోని మా నాయకులందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.