Home » Manikonda
హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా) మణికొండలో అక్రమ కట్టడాలపై యాక్షన్‌లోకి దిగింది. నివాస క్యాటగిరీలో అనుమతులు తీసుకున్న ఓ అపార్ట్‌మెంట్‌లో.. వాణిజ్య పరంగా వాడుతున్న దుకాణాలను గురువారం స్థానిక మునిసిపల్ అధికారులతో కలిసి, కూల్చివేసింది.
గృహప్రవేశం రోజున వెలిగించిన అఖండ దీపం ఆరిపోకుండా ఉండేందుకు రక్షణగా పెట్టిన చిమ్నీ(గాజుపాత్ర) పేలి ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.75 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది.
స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ప్రమాణిస్తున్న కారు ఢీకొని ఓ మహిళ మరణించింది. కాజీపేట మండలం మడికొండలో శనివారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గోల్డన్ టెంపుల్ వద్ద రోడ్డుపై పార్క్ చేసిన మోటర్ సైకిళ్లను ఢీ కొట్టుకుంటూ కారు దూసుకెళ్లింది. అక్కడ నిలిపి ఉంచిన 20 మోటార్ సైకిళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. కారును వెంబడించి మరీ కాలనీ వాసులు పట్టుకున్నారు. కారును నడిపింది మైనర్ బాలుడని తెలుస్తోంది.