Home » Manipur
దేశంలో అన్యాయ కాలం నడుస్తున్నందునే న్యాయ్ యాత్ర చేపట్టినట్టు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్‌లోని ధౌబల్‌లో 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను రాహుల్ ఆదివారంనాడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలను ఏకం చేయడానికే భారత్ న్యాయ్ యాత్ర చేపడుతున్నామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మణిపూర్ నుంచి మొదలైంది. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, ప్రజలందరికీ న్యాయం అనే సందేశంతో రాహుల్ గాంధీ సారథ్యంలో చేపట్టిన ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రాహుల్‌కు జెండా అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను మణిపూర్ నుంచి శ్రీకారం చుడుతున్నాడు. రాహుల్ గాంధీ సారథ్యంలో చేపడుతున్న ఈ యాత్ర 12 పైగా రాష్ట్రాల మీదుగా రెండు నెలలకు పైగా సాగుతుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఇండిగో విమానాలలో ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ చేరుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 'భారత్ జోడో న్యాయ్ యాత్ర(bharat jodo nyay yatra)' జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభం కానుందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్ పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ప్రధానంగా ఈ అంశాలపైనే అధికార బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో 'భారత్ జోడో న్యాయ యాత్ర'ను మణిపూర్‌లో ప్రారంభించి ముంబయి వరకు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఈ యాత్ర ప్రారంభం కాకముందే కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.
మణిపూర్‌లో ఇకపై అంబులెన్స్‌లకు (Ambulance) వాడే సైరెన్ డిఫరెంట్‌గా ఉండాలని వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం స్పష్టంచేసింది. అంబులెన్స్‌లకు (Ambulance) ఇచ్చే సైరన్ మరే వాహనాలను ఉండకూడదని తేల్చిచెప్పింది.
జాతుల ఘర్షణలతో ఇటీవల కాలంలో అడ్డుడికిన మణిపూర్‌లో మంగళవారంనాడు మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. తోంగనోవ్‌పల్ జిల్లా మోరేహ్ జిల్లాలో గాలింపు చర్యలు జరుపుతున్న ఏడుగురు భద్రతా సిబ్బంది ఈ ఘటనలో గాయపడ్డారు.
మణిపుర్(Manipur)ని శుక్రవారం రాత్రి భారీ భూకంపం(Earthquake) వణికించింది. దీంతో స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉఖ్రుల్ కు 280 కి.మీ.ల దూరంలో ఉన్న మయన్మార్(Myanmar)లో గత రాత్రి 10 గంటలకు 120 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
మణిపూర్ లోని తేంగనౌపల్ జిల్లాలో రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య ఎదురెదురు కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. లెయితు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగి ఈ కాల్పుల్లో 13 మంది మరణించారు.
Bank Robbery in Manipur: మణిపూర్‌లో తాజాగా జరిగిన బ్యాంక్ దోపిడీ సినిమాల్లో కనిపించే సీన్‌ను తలపించింది. ముఖానికి మాస్కులతో సడన్‌గా బ్యాంకులోకి దూరిన ముసుగు ముఠా అక్కడి సిబ్బందికి పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి ఏకంగా రూ. 18కోట్లు దోచుకెళ్లింది.