Home » Manipur
జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్ లో తిరిగి శాంతి పవనాలు నెలకొనే దిశగా కీలక అడుగుపడింది. సాయుధ యునైటెడ్ నేషనల్ లిబరేష్ ఫ్రంట్, కేంద్రం మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా బుధవారంనాడు ప్రకటించారు.
హింసాకాండతో ఇటీవల అట్టుడికిన మణిపూర్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు రాష్ట్రం ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. మణిపూర్ లోయలోని ఒక తిరుగుబాటు సంస్థతో శాంతి చర్చలు జరుపుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు తెలిపారు. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని వెల్లడించారు.
జాతుల మధ్య ఘర్షణతో అట్టుడికి ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న మణిపూర్ మరోసారి ఉలిక్కిపడింది. మయనార్మ్తో సరిహద్దులకు సమీపంలోని మోరే ప్రాంతంలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి చింగ్తం ఆనంద్పై చొరబాటులు మంగళవారం ఉదయం కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మణిపుర్(Manipur) లో ఈ ఏడాది ప్రథామార్థంలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ ఘర్షణల్లో దుండగులు హింసకు పాల్పడటానికి వివిధ మార్గాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో హింస చల్లారుతున్న క్రమంలో భద్రతా బలగాలు 3 సర్చ్ ఆపరేషన్లు నిర్వహించి వెపన్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
మణిపుర్(Manipur)లో హింసాత్మక ఘటనలు చల్లారట్లేదు. నిత్యం ఏదో ఓ చోట నిరసనకారులు(Protesters) ఆందోళనలు చేస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.
మణిపుర్ హింస(Manipur Riots)పై ప్రధాని మోదీ స్పందించకుండా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) విమర్శించారు.
మణిపుర్(Manipur)లో తాజా హింసను కారణమైన ఇద్దరు మైతేయి(Meitei) ప్రేమికుల హత్యకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు .
రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థుల(Students) దారుణ హత్య ఉదంతానికి సంబంధించిన వీడియోలు విడుదలైన తరువాత సీఎం బీరెన్ సింగ్(Biren Singh) పై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. హత్యలను నిరసిస్తూ రాజధాని ఇంఫాల్(Imphal) లో ప్రజలు, విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కీలక ప్రకటన చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
మణిపుర్(Manipur) రాష్ట్రంలో కుకి, మైతేయి తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణ మరవక ముందే మరోసారి అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. 3 నెలల క్రితం ఇద్దరు స్టూడెంట్స్(Students) ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.
తరచు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ ను 'కల్లోలిత ప్రాంతం'గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది.