Chhattisgarh Encounter: మరోసారి ఎన్‌కౌంటర్.. మహిళా నక్సలైట్ మృతి
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:59 PM
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతంలో కాల్పుల మోత కొనసాగుతోంది. తాజాగా మరోసారి భద్రతబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

చత్తీస్‌గఢ్, మార్చి 31: చత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ (Chhattisgarh Encounter) జరిగింది. దంతేవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్‌లకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు భారీగా కొనసాగుతున్నాయి. ఈరోజు (సోమవారం) ఉదయం భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కాగా.. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. గత మూడు నెలలుగా జరుగుతున్న భారీ ఎన్‌కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈనెలలో రెండు భారీ ఎన్‌కౌంటర్‌లు జరుగగా.. దాదాపు 43 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టుల మృతిచెందారు. ఈనెల 29న (శనివారం) సుక్మా జిల్లా కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొగుండ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్ట్‌లకు మధ్య ఎదురుకాల్పులు జరుగగా.. 17 మంది మావోలు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు నేత, దర్బా డివిజన్ కమిటీ కార్యదర్శి జగదీశ్ మరణించాడు. జగదీష్‌పై చత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డును ప్రకటించింది.
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
మృతుల్లో 11 మంది మహిళలు కూడా ఉన్నారు. ఘటనాస్థలి నుంచి ఏకే-47 రైఫిల్స్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, రాకెట్ లాంఛర్లు, బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లు కూడా గాయపడ్డారు. అంతకు ముందు మార్చి 20న కూడా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్- కాంకేర్ జిల్లాల్లో మావోలకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మరణించారు. ఈ మూడు నెలల్లో వేరేరు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్లలో దాదాపు 130 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి
Kodali Nani Health: ప్రత్యేక విమానంలో ముంబైకి కొడాలి నాని.. కారణమిదే
Nagar Kurnool Incident: దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం
Read Latest National News And Telugu News