Share News

Lookout Notice: కాకాణితో సహా మిగిలిన నిందితుల‌ కోసం పోలీసులు గాలింపు

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:14 AM

అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్‌ను కాకాణి అండ్ బ్యాచ్‌ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Lookout Notice: కాకాణితో సహా మిగిలిన నిందితుల‌ కోసం పోలీసులు గాలింపు
Former Minister Kakani Goverdhan Reddy

నెల్లూరు: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణితో (Former Minister Kakani Goverdhan Reddy) సహా మిగిలిన నిందితుల‌ కోసం పోలీసులు (Police) గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ (SP Krishnakanth) నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాదు (Hydeabad), బెంగుళూరు (Bangalore), చెన్నై (Chennai) ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలోనే ఉన్నారు. కాకాణి దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు (lookout notice) జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులు, సీ పోర్టులకు సమాచారం ఇచ్చారు. కాగా నిన్న (బుధవారం) కాకాణి ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అలాగే క్వాష్ పిటీషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Also Read..: Online Betting Games.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..


అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్‌ను కాకాణి అండ్ బ్యాచ్‌ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాకాణి గోవర్థన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బుధవారం గట్టి షాక్ ఇచ్చింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో కాకాణికి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అలాగే కేసును కొట్టివేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటీషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరడంతో హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసుతో కాకాణికి సంబంధం లేదని అందువల్ల ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.


కాగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలకు సంబంధించి విచారించేందుకు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కాకాణి హాజరుకాలేదని, అతని అనుచరులు కలిసి క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు చేశారని, ప్రభుత్వ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయని, ఈ తవ్వకాల వెనక కాకాణి ఉన్నారని ప్రాసిక్యూషన్ తరపున కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కాకాణి తరపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు అని స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది.

గత ప్రభుత్వ హయాంలో కాకాణి సొంత గ్రామం తోడేరుకు అతి సమీపంలోని వరదాయపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్ జరిగింది. అప్పటి మంత్రిగా ఉన్న కాకాణి కనుసన్నల్లోనే ఈ మైనింగ్‌ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ దాదాపు 30 ఏళ్లుగా మైనింగ్ నిర్వహిస్తున్న రుసుం మైన్స్‌ను బెదిరించి వారిని అక్కడి నుంచి తరిమేసి.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్వార్ట్జ్ అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నెల్లూరులో అక్రమ మైనింగ్‌పై ఫిబ్రవరి 16న పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా విచారణకు రావాల్సిందిగా కాకాణికి మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే తాను తప్పించుకోవడం లేదని, పోలీసులకు సహకరిస్తానని ఓవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే పోలీసుల కన్నుగప్పి పరారీలోనే ఉంటున్నారు. మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కాకాణి విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగతంగా కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ప్రతీసారి అక్కడ ఆయన లేకపోవడంతో పోలీసులు ఆయన బంధువులకు ఇస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శాంతి చ‌ర్చ‌ల‌పై మావోయిస్టు పార్టీ తాజా స్పంద‌న‌

కీలక దశకు మంత్రి లోకేష్ కేసు..

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 11:14 AM