Share News

WhatsApp: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. సైబర్ అటాక్‌కు అవకాశం..

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:12 AM

WhatsApp Security Issue Alert: ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కంప్యూటర్‌లో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని వాడే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంది. స్పూఫింగ్ అటాక్‌కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. సైబర్ అటాక్‌కు అవకాశం..

ఒకప్పుడు వాట్సాప్ మొబైల్ ఫోన్లలోనే అందుబాటులో ఉండేది. తర్వాతి కాలంలో కంప్యూటర్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. యాప్‌తో పాటు వాట్సాప్ వెబ్ కూడా అందుబాటులో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కంప్యూటర్‌లో వాట్సాప్ వాడుతున్నారు. అయితే, కంప్యూటర్లో వాట్సాప్ వాడే వారికి ప్రమాదం పొంచి ఉంది. సదరు యూజర్లు సైబర్ అటాక్స్ బారిన పడే అవకాశం ఉందని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ బుధవారం హై అలర్ట్ ప్రకటించింది. కంప్యూటర్‌లో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని వాడే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంది. స్పూఫింగ్ అటాక్‌కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.


ఎమ్ఐఎమ్ఈ టైప్, ఫైల్ ఎక్స్‌టెన్షన్‌ల మధ్య మిస్ కన్ఫిగరేషన్ కారణంగా అటాచ్‌మెంట్స్‌ను హ్యాండిల్ చేయటంలో సమస్య తలెత్తుతోంది. దీన్ని అటాకర్లు పావుగా వాడుకుంటున్నారు. హానికరమైన అటాచ్‌మెంట్లను యూజర్లకు పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేసినపుడు అవి వాట్సాప్‌లోనే ఓపెన్ అవుతున్నాయి. దీంతో అటాకర్లు ఆర్బిటరీ కోడ్‌ను పంపి అటాక్ చేస్తున్నారు. విండోస్‌ కంప్యూటర్లకు సైబర్ అటాక్స్ ప్రమాదం ఉంది. 2.2450.6 కంటే పాత వర్సన్ విడోస్ కంప్యూటర్లు స్పూప్ అటాక్ బారినపడే అవకాశం ఉంది. ఈ అటాక్ బారిన పడకుండా ఉండాలంటే.. వెంటనే వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఎప్పుడైనా సైబర్ అటాక్‌కు గురయ్యే అవకాశం ఉంది.


వాట్సాప్ కొత్త అప్డేట్

యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది. సాధారణంగా వాట్సాప్ ద్వారా మనం ఎవరికైనా ఫొటోలు, వీడియోలు పంపితే.. అవతలి వాళ్లు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, వాట్సాప్ అందుబాటులోకి తీసుకురాబోయే అప్‌డేట్‌తో అవతలి వాళ్లు మనం పంపే ఫొటోలు, వీడియోలు సేవ్ చేసుకునే అవకాశం ఉండదు. అంతేకాదు.. వాటిని ఇతరులకు ఫార్వడ్ చేసే అవకాశం కూడా ఉండదు. మీరు అనుమతి ఇస్తే తప్ప వాటిని సేవ్ చేసుకోవటం కానీ, ఫార్వడ్ చేయటం కానీ కుదరదు. ఇక, ఈ అప్‌డేట్ మొదటగా ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.


ఇవి కూడా చదవండి:

హ్యాట్సాప్ పోలీస్ సార్.. మీ మంచి మనసుకు జోహార్లు

Chanakya Neeti In Telugu: జీవితంలో సక్సెస్ కావాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే మీరే కింగ్..

హీరో స్టెప్పులు..

Updated Date - Apr 10 , 2025 | 11:13 AM