Share News

మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:28 AM

బ్రాహ్మణకొట్కూరు పీహెచ్‌సీని అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో నడిపిద్దామని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు.

  మెరుగైన వైద్య సేవలు అందించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు రూరల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణకొట్కూరు పీహెచ్‌సీని అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో నడిపిద్దామని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు. బ్రాహ్మణ కొట్కూరు పీహెచ్‌సీ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధులకు సంబంధించి రికార్డులను కచ్చితంగా నిర్వహించాలన్నారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మ, డాక్టర్‌ సరితాదేవి, నాయకులు సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు మద్దూరు హరిసర్వోత్తమ రెడ్డి, మాజీ సర్పంచ్‌ కలీలుల్లాబేగ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:28 AM