Home » New Ration Cards
CM Revanth Reddy: అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
New Ration Cards In Telangana: కొత్త రేషన్ కార్డులకు అప్లయ్ చేసుకునేందుకు జనాలు పెద్ద ఎత్తున మీ-సేవల దగ్గర బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Minister Seethakka: పదేళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారని.. గ్రామ సభల్లోనే అర్హులని గుర్తిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే పథకాలు వచ్చేవని విమర్శించారు. ఫామ్ హౌస్‌లో, ఎమ్మెల్యేలు ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారని.. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.
New Ration Cards: కులగణన సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు జారీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. రేషన్ కార్డు దరఖాస్తుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కులగణన సర్వే ఆధారంగా కాకుండా గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలో అర్హత కలిగిన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది.
కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. త్వరలో కొత్త కార్డులు జారీచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాం నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం బీపీఎల్ కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.