Share News

CM Revanth Reddy: కొత్త రేషన్ కార్డులు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:35 PM

CM Revanth Reddy: అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

CM Revanth Reddy: కొత్త రేషన్ కార్డులు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
CM Revanth Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణలో (Telangana) నూతన రేషన్‌ కార్డులపై (Ration Cards) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందే అని సీఎం స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఈరోజు (సోమవారం) సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ సప్లైస్ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సివిల్‌ సప్లై‌‌స్‌కు సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం. వెంటనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరసమైన ఏర్పాట్లను వెంటనే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో త్వరితగతిన ఈ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. అందులో ప్రధానంగా ఉమ్మడి ఏడు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ లేదు. ఈ మూడు జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. దీంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమఘ్నమై ఉన్నారు.

Seethakka: రాహుల్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు.. సీతక్క ఫైర్


గత జనవరి 26నే ప్రతిష్టాత్మకమై నాలుగు పథకాలను ప్రారంభించింది సర్కార్. అందులో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిర ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు శ్రీకారం చుట్టింది. అందుకోసం గ్రామాల వారీగా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. జాబితాలను సిద్ధం చేయగా.. ఈలోపే జనవరి 29 ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. రెండు టీచర్, ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ వచ్చింది. దీంతో రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు బ్రేక్ పడినట్లైంది. అయితే కోడ్ లేని మూడు జిల్లాలో రేషన్ కార్డులను జారీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసింది.revanth-rationcards.jpg


దీంతో రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం అయ్యాయి. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌తో రేషన్ కార్డుల జారీ నిలిచిపోవడంతో ప్రజలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి. దీనిపై కూడా ఈరోజు సమీక్షలో మాట్లాడిన సీఎం.. ప్రజలు మళ్లీ దరఖాస్తులు చేసుకోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మొత్తానికి కోడ్ అమలులోనే మూడు జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుంది.


ఇవి కూడా చదవండి...

రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. పరిస్థితి ఎలా ఉందంటే..

Seethakka: రాహుల్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు.. సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 17 , 2025 | 05:03 PM

News Hub