New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. జరగబోయేది ఇదే..
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:32 PM
New Ration Cards In Telangana: కొత్త రేషన్ కార్డులకు అప్లయ్ చేసుకునేందుకు జనాలు పెద్ద ఎత్తున మీ-సేవల దగ్గర బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులు జారీ చేసిన సర్కారు.. నూతనంగా దరఖాస్తు చేసే చాన్స్ కూడా కల్పిస్తోంది. దీంతో మీ-సేవా కేంద్రాల దగ్గర భారీగా జనం బారులు తీరుతున్నారు. గత రెండ్రోజుల నుంచి మీ-సేవా సెంటర్ల దగ్గర భారీగా రద్దీ నెలకొంటోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కార్డు రాకపోవడంతో వాళ్లలో చాలా మంది మీ-సేవలో తిరిగి అప్లయ్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇప్పట్లో నూతన రేషన్ కార్డులు లేనట్లేనని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
అప్పటివరకు కొత్తవి లేనట్లే!
ప్రస్తుతం తెలంగాణలోని పలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ స్థానానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అటు మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంగనర్‌లో టీచర్ ఎమ్మెల్సీకి నగారా మోగింది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇది ముగిసేవరకు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోనుంది. గ్యాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎలక్షన్ ముగిశాకే నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవనుందని తెలుస్తోంది. అయితే కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని.. ఇది నిరంతర ప్రక్రియ అని, మీ-సేవా కేంద్రాల్లో అప్లయ్ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అంటున్నారు.
ఇవీ చదవండి:
కేసీఆర్‌పై కక్షతోనే రైతులకు ఇబ్బందులు
తెలంగాణలో మరోసారి కులగణన సర్వే
మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్
మరిన్ని తెలంగాణ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి