Home » Nirmal
Basara Saraswathi Devi Temple: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో రాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. క్యూలైన్ మీదుగా నడుచుకుంటూ వచ్చిన దొంగ గోషాల పై నుంచి ఆలయంలోకి దిగాడు. దత్త మందిరం ముందున్న హుండీని పగలగొట్టి నగదును తీసుకున్నాడు.
గ్రామ శివారులో చేపట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్వాసులు ఆందోళన చేపట్టారు. మంగళవారం దిలావర్పూర్ బంద్‌కు పిలుపునిచ్చారు.
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాలను మోసం చేసేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారని, మోసం చేసేందుకు కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. ఓ తండ్రికి ఫోన్ చేసి మీ కూతురిని కిడ్నాప్ చేశామని ఒకడు, మహిళ పేరుతో డ్రగ్స్ సప్లై అవుతున్నామని మరొకడు ఫోన్ చేశాడు. జనాలను బురిడీ కొట్టించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ఉపాధి కోసం ఎడారి దేశం కువైట్‌కు వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయి, యజమాని వేధింపులకు గురవుతూ అనారోగ్యం బారిన పడిన నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ కుటుంబానికి ఎమ్మెల్యే, కలెక్టర్ భరోసా కల్పించారు.
‘కాలం చెల్లిన సెలైన్‌తో రోగికి చికిత్స’ అనే శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు.
దళారుల మాటలు నమ్మి భారత్ నుంచి సౌదీ అరేబియా వెళ్లి ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేసే ఓ వ్యక్తి దుర్భర జీవితం ఇతివృత్తంగా ఇటీవల ఆడు జీవితం అనే సినిమా వచ్చింది.
ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. కాలం చెల్లిన మందులు, ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్లను ఇష్టానుసారం వినియోగిస్తుండడం.. రోగుల ప్రాణం మీదకు వస్తోంది.
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి బాసరకు తరలి వస్తుంటారు. ప్రతి ఏటా వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Telangana: రోజులు గడుస్తున్నప్పటికీ కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు మాత్రం ఇంకా పూర్తి కాని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రాజెక్ట్‌లోని నీరు వృధాగా పోతోంది. మరోవైపు తాజాగా కురుస్తున్న వర్షాలకు ఎగవ నుంచి ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. అయితే మరమ్మతులు పూర్తి కాకపోవడంతో 1, 2, 3 గేట్ల నుంచి నీరు వృధాగా పోతోంది.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలు మరోసారి బట్టబయలయ్యాయి. బాసర గ్రామస్థుల చొరవతో ఆలయ సిబ్బంది అవినీతి బాగోతం బట్టబయలైంది. గ్రామస్థుల ముందస్తు సమాచారం మేరకు అధికారులు ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద శుక్రవారం తనిఖీలు చేపట్టారు.