Home » Peddapalli
టమాట సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వచ్చాయి. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో, కనీసం పెట్టుబడులు కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మార్కెట్లో కిలో టమాట పది నుంచి పదిహేను రూపాయలుండగా రైతులకు కిలో మూడు, నాలుగు రూపాయలు కూడా ఇవ్వడం లేదు.
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభ పెట్టకుండా పకడ్బందీ నిఽఘా పెట్టాలని, పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని అరుణోదయ రాష్ట్ర నాయకురాలు విమలక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను, ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం హత మారుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలంతా తమ పౌరుషాన్ని, దమ్ము చూపాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో మాట్లాడారు.
BJP: బీజేపీ నేతల సమావేశంలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. తన ఫోటోను ఫ్లెక్సీలో ఎందుకు వేయలేదంటూ పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నేత శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో మాదిరిగా పాత ఇళ్ల పేరిట బిల్లులు తీసుకోవడం, ఇళ్లు నిర్మించకున్నా నిర్మించినట్లు బిల్లులు తీసుకోవడం వంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్సింగ్ చేయాలని నిర్ణయించింది. ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభు త్వం జియో ఫెన్సింగ్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీని కోసం కృతిమ మేధ (ఏఐ) సాయంతో ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇంది రమ్మ ఇళ్లతో దీన్ని అమల్లోకి తేనున్నారు.
సుల్తానాబాద్ పట్టణంలోని మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం సుల్తానాబాద్‌లో విఫలమైంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీరు సరఫరా జరగడం లేదు. ఇంటింటికి బిగించిన భగీరథ నల్లాల ద్వారా చుక్కనీరు రావడం లేదు.
రామ గుండంలో టీయూఎఫ్ఐడీసీ, ఎస్డీఎఫ్ నిధు లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెం చాలని కలెక్టర్, రామగుండం మున్సిపల్ కార్పొ రేషన్ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష అధికారు లను ఆదేశించారు. గురువారం కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో రామగుండం కమిషరేట్ టాస్క్‌ఫోర్స్ బృందాలు గంజాయి రవాణా, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. పకడ్బందీ సమాచారంతో ఒకే రోజు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాడులు నిర్వహించి 1.2 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. 15 మంది నిందితులను అరెస్టు చేసి రెండు కార్లు, ఐదు మోటార్ సైకిళ్లు, 17సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జిల్లాలో ఊపందుకున్నది. పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.