Home » Personal finance
Best Home Loans: గత ఏడాది కాలంగా దేశంలో రెపో రేటు(Repo Rate)లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 2023లో రెపో రేటును 0.25 శాతం పెంచారు. దీంతో రెపో రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గృహ రుణ(Home Loans) వడ్డీ రేట్లు కూడా పెద్దగా పెరగలేదు.
UPI Payments: ప్రస్తుతం అంతా యూపీఐ పేమెంట్స్ కాలం నడుస్తోంది. దీని కారణంగా మనీ ట్రాన్స్ఫర్ సెకన్లలో పూర్తవుతుంది. ఫోన్ తీసుడే.. డబ్బు కొట్టుడే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే, ఈ స్పీడ్ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. పొరపాటుగా ఒకరికి పంపించాల్సిన డబ్బు.. తెలియని వారికి పంపడం జరుగుతుంది. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
LPG Latest Price in India: మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఫిబ్రవరి నెల ప్రారంభం కానుండటంతో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను స్వల్పంగా పెంచగా.. దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను చివరగా ఆగస్టు 30న సవరించిన చమురు కంపెనీలు.. ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చేయలేదు.
Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన సీతారామన్.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించడం జరిగిందన్నారు. 2014కు ముందు దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందన్న ఆర్థిక మంత్రి.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయన్నారు. కరోనా సంక్షోభాన్ని దేశం అధిగమించిందని చెప్పారు.
Union Budget 2024: ఇవాళ పార్లమెంట్లో మధ్యంత బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ బడ్జెట్లో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్లో ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారా? అని ఆశగా చూస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకొని.. సామాన్య ప్రజలందరి వరకు బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు.
Money Saving Tips: అసలే ద్రవ్యోల్బణ కాలం.. ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా సంపాదించిన డబ్బంతా నీళ్లలా ఖర్చైపోతుంది. అందుకే.. డబ్బు సంపాదించడం కంటే.. ఆదా చేయడం నేర్చుకోవాలి. అదే అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రజలు తమ సంపాదనను బట్టి ఖర్చులు పెంచుకుంటూ వెళ్తున్నారు.
Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..
Union Budget 2024: ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి ప్రతి నెలా ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది. అయితే, మిగతా నెలలతో పోలిస్తే.. ఫిబ్రవరి నెల చాలా కీలకం అని చెప్పుకోవాలి. రానున్న ఫిబ్రవరి నెలలో ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
మీ వద్ద ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా? ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? మీకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ కేంద్రాల్లోనే కాకుండా.. పోస్టాఫిసు ద్వారా కూడా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
అవసరమైనప్పుడల్లా కార్డు సహాయంతో ఏటీఎం సెంటర్కు వెళ్లి నగదును డ్రా చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఏటీఎం కార్డులు పోగొట్టుకోవడం గానీ.. దొంగిలించడం గానీ చేస్తుంటారు. అలాంటి పరిస్థితిలో బాధిత వ్యక్తులు తమ కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే, చాలా మందికి కార్డును ఎలా బ్లాక్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.