BPCL Greenfield Refinery : రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ వ్యయం 96,862 కోట్లు: అనుప్రియ పటేల్
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:45 AM
ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.96,862 కోట్లు’ అని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు.

ఢిల్లీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్, రామాయపట్నంలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.96,862 కోట్లు’ అని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అదేవిధంగా ‘పరిశోధన, అభివృద్ధి గణాంకాలు, 2022-23’ ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి వాటాలో ఔషధ రంగం 33 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2016లో విశాఖపట్నంలో నైపర్ విద్యాసంస్థను కేంద్రం మంజూరు చేయలేదు’ అన్నారు.