Credit card safety Tips: పెట్రోల్ పంప్స్ దగ్గర క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. జాగ్రత్త.. ఈ 5 టిప్స్ తెలియకపోతే మోసపోతారు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:37 PM
Credit card fraud at petrol pumps: దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపులు ఇప్పుడు క్రెడిట్ కార్డు మోసాలకు అడ్డాగా మారుతున్నాయి. మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ గురించి తెలుసుకోండి. లేకపోతే క్రెడిట్ కార్డు మోసాల నుంచి తప్పించుకోవడం కష్టం..

Credit card safety at petrol stations: భారతదేశంలోని పెట్రోల్ పంపులు క్రెడిట్ కార్డ్ మోసానికి హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. కార్డ్ స్కిమ్మింగ్, మోసపూరిత లావాదేవీలు పెరుగుతున్నాయి. అందుకే ఆర్థిక సమాచారం సురక్షితంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పెట్రోల్ పంపులు, గ్యాస్ స్టేషన్లలో క్రెడిట్ కార్డులను ఉపయోగించేటప్పుడు వినియోగదారులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ATMలు లేదా మర్చంట్ లొకేషన్స్‌లో మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించినపుడు వారు మీ వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి అవకాశముది. ఈ పద్ధతినే కార్డ్ స్కిమ్మింగ్ అంటారు. అందుకే అలాంటి ప్రదేశాలలో క్రెడిట్ కార్డును ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్ పంపుల వద్ద క్రెడిట్ కార్డ్ మోసాలు నివారించడానికి 5 ముఖ్యమైన చిట్కాలు.
1. కార్డ్ రీడర్ తనిఖీ
మీ కార్డును స్వైప్ చేసే ముందు కార్డ్ రీడర్‌ను తనిఖీ చేయండి. అనవసర అటాచ్‌మెంట్‌లు లేదా వదులుగా ఉన్న భాగాలు ఉన్నాయేమో గమనించండి. ఎందుకంటే కొందరు మోసగాళ్లు కార్డ్ వివరాలను దొంగిలించడానికి స్కిమ్మింగ్ పరికరాలను ఇన్‌స్టాల్ చేస్తారు. అందుకే సింపుల్ "జిగల్ టెస్ట్" చేయండి. అంటే కార్డ్ రీడర్‌ను సున్నితంగా కదిలించి చూడండి. అలాగే కార్డ్ రీడర్ వంగి లేదా తారుమారు చేసినట్టు అనిపించినా అనుమానించాల్సిందే. రూల్స్ ప్రకారం రీడర్‌లు కదలకుండా స్థిరంగా ఉంటేనే సురక్షితంగా ఉన్నట్టు లెక్క.
2. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్
సాధ్యమైనంతవరకూ ట్యాప్-టు-పే కార్డులు లేదా మొబైల్ వాలెట్లు వంటి కాంటాక్ట్‌లెస్ చెల్లింపు పద్ధతులను ఎంచుకోండి. ఈ పద్ధతులు స్కిమ్మింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే మీ కార్డ్ ఎప్పుడూ టెర్మినల్‌తో డైరెక్ట్ గా కనెక్ట్ కాదు. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ప్రధానంగా భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విస్తృతంగా అంగీకరిస్తాయి. ఈ పద్ధతిలో లావాదేవీలను సురక్షితంగా, వేగంగా చేయవచ్చు. మోసం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పెట్రోల్ పంపుల దగ్గర ఈ ఆప్షన్ ఉందేమో అడగండి.
3. లావాదేవీల తనిఖీ
ఏవైనా అనధికార లావాదేవీలను గుర్తించడానికి మీ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా సమీక్షించండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే మీ బ్యాంకు లేదా సంబంధింత ఆర్థిక సంస్థకు తెలియజేయండి.ఈమెయిల్ లేదా SMS ద్వారా లావాదేవీ హెచ్చరికలను సెటప్ చేసుకోవడం ద్వారా ట్రాన్సాక్షన్స్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. మోసాన్ని అరికట్టేందుకు, పరిమితం చేసేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
4. అప్రమత్తంగా ఉండండి
చెల్లింపు చేసేటప్పుడు మీ కార్డును నిశితంగా పరిశీలించండి. లావాదేవీ మీ సమక్షంలోనే పూర్తయిందో లేదో.. కార్డును వెంటనే తిరిగి ఇచ్చారో.. లేదో.. నిర్ధారించుకోండి. ఇలా నిఘా పెట్టడం వల్ల కార్డ్ క్లోనింగ్ లేదా అనధికార స్వైపింగ్ వంటి మోసాల అవకాశాలను అరికట్టవచ్చు. పేమెంట్స్ మెషీన్ లోపల ఉందని చెప్తే నమ్మకండి. దానిని మీ వద్దకే తీసుకురావాలని అడగండి. అవతలి వ్యక్తి చేతిలో క్రెడిట్ కార్డు ఉన్నంతసేపు ఓ కన్నేసి ఉంచండి.
5. పెట్రోల్ బంకులు
సాధ్యమైనప్పుడల్లా సీసీ కెమెరాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్న ప్రసిద్ధి చెందిన పెట్రోల్ బంకులనే ఎంచుకోండి. ఇలాంటి స్టేషన్లు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే అవకాశం తక్కువ. తెలియని ప్రాంతాల్లో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. చెల్లింపు కౌంటర్లను తనిఖీ చేయండి. చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యేవరకూ నిరంతరం పర్యవేక్షించండి.
పై జాగ్రత్తలను పాటించడం ద్వారా పెట్రోల్ పంపుల వద్ద క్రెడిట్ కార్డ్ మోసాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక భద్రతతో పాటు మనశ్శాంతి లభిస్తుంది.
Read Also: Anand Mahindra: జీబ్లీ క్లబ్‌లోకి మహీంద్రా.. ఫోటో షేర్ చేసిన బిజినెస్ టైకూన్
ITR Filing 2025: ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..
Trade Setup For April 3: షేర్ మార్కెట్ ఇవాళ్టి ట్రేడ్ సెటప్..