Good News: గురు టెన్షన్ వద్దు.. పెట్రోల్ రేటు పెరిగినా నీ జేబు సేఫ్
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:10 PM
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్తతో ఆందోళన చెందుతున్నారా. బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఒక రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుందనుకుంటున్నారా. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్సైజ్ సుంకం పెరిగినా వాహనదారులపై ఎలాంటి భారం పడబోదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయనే వార్తతో వాహనదారులంతా హడావుడిగా పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారా.. ఒక్కసారిగా మీరు ఆగిపోండి. పెట్రోల్, డీజిల్ రేటు పెరిగినా మీకు వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు కొట్టించుకున్నా.. రేపు కొట్టించుకున్నా మీ సొమ్ము ఏం పోదట. అవును మీరు చదువుతున్నది నిజమే. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ ప్రకటన చేసింది. పేట్రోల్, డీజిల్‌పై పెంచుతున్న రూ.2 ఎక్సైజ్ సుంకంతో వాహనదారుడిపై ఎలాంటి భారం పడబోదని తేల్చి చెప్పింది. ఆయిల్ కంపెనీలే ఈ భారాన్ని భరిస్తాయని తేల్చేసింది. వినియోగదారుడిపై నేరుగా ఈ భారం పడకుండా చర్యలు చేపట్టినట్లు కేంద్రం ప్రకటించడంతో ఈ అర్థరాత్రి నుంచి ఇంధనం ధరలు పెరిగిన నేరుగా వాహనదారుడిపై ఎలాంటి ప్రభావం చూపించదు. ప్రస్తుత ధరలకే పెట్రోల్, డీజిల్ లభిస్తుంది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయంటే పెట్రోల్ బంకులకు భారీగా క్యూ కట్టడం, ఒక్కోసారి తగాదాలు పెట్టుకోవడం సర్వసాధారణం. అందుకే ఆందోళనతో జనం పెట్రోల్ అవుట్‌లెట్‌లకు క్యూ కడతారనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం తక్షణమే స్పందించింది.
ప్రస్తుతం ధరలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109 నుంచి రూ.110 మధ్య ఉండగా జిల్లాను బట్టి పైసల్లో తేడా ఉంటుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ ధరలపై రూ.2 ఎక్సైజ్ సుంకం పెరగనుంది. అయినప్పటికీ పెట్రోల్ ధర రూ.109 నుంచి రూ.110 వరకే ఉండనుంది. డీజిల్ ధర రూ.97.44 ఉండగా పెంచిన ధరతో రూ.99.44కు పెరగాల్సి ఉంటుంది. కాని మంగళవారం నుంచి కూడా రూ.97.44కే డీజిల్ లభిస్తుంది. పెరిగిన ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలు భరిస్తాయని కేంద్రం చెప్పడంతో వాహనదారులపై ఎలాంట ప్రభావం ఉండబోదు. అదేవిధంగా రాష్ట్రాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చెరిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రూ.1 నుంచి రూ.2 వరకు తక్కువ ఉండే అవకాశం ఉంది.
గతంలో తగ్గిన ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయని ప్రజల నుంచి విమర్శలు రావడంతో కేంద్రప్రభుత్వం 2021 నవంబర్ 4వ తేదీన కేంద్రప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అలాగే రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించాలని పిలుపునిచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంతో వ్యాట్‌ను తగ్గించలేదు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం తన ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..
నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here