Share News

Kerala: కొండచరియల బీభత్సం

ABN , Publish Date - Jul 30 , 2024 | 08:35 AM

కేరళలో కొండచరియలు విరిగిపడ్డాయి. వయనాడు జిల్లా మెప్పాడి వద్ద మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ కొండ చరియ విరిగిపడింది. తర్వాత తెల్లవారు జామున 4.10 గంటలకు మరొ కొండ చరియ పడింది. కొండ చరియలు పడటంతో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 16 మంది గాయపడ్డారు. వారికి మెప్పాడిలో గల ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Kerala: కొండచరియల బీభత్సం
Landslides Hit Kerala's Wayanad,

వయనాడు: కేరళలో (Kerala) కొండచరియలు (Landslides Hit) విరిగిపడ్డాయి. వయనాడు జిల్లా మెప్పాడి వద్ద మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ కొండ చరియ విరిగిపడింది. తర్వాత తెల్లవారు జామున 4.10 గంటలకు మరో కొండ చరియ పడింది. కొండ చరియలు పడటంతో 54 మంది చనిపోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 16 మంది గాయపడ్డారు. వారికి మెప్పాడిలో గల ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


రంగంలోకి బృందాలు

కొండ చరియలు విరిగి పడిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపడతారు. సూలూరు నుంచి ఎంఐ-17, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లను తరలిస్తారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. కొండ చరియలు విరిగిపడిన ఫుటేజీని వెస్ట్ కోస్ట్ వెదర్ మెన్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.


సహాయ చర్యలకు ఆటంకం

వయనాడు, మెప్పాడిలో భారీ వర్షం పడుతోంది. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ‘ఘటన జరిగిన వెంటనే అన్ని ప్రభుత్వ విభాగాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఆ ప్రాంతానికి మంత్రులు వెళ్లి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. సహాయం కోసం 9656938689, 8086010833 హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాం. సాయం కోసం కాల్ చేయాలి అని’ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు.


Read More National News
and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 01:57 PM