Share News

Uttam Kumar Reddy: జగన్‌తో కుమ్మక్కై ..తెలంగాణకు అన్యాయం చేశారు.. హరీష్‌రావుపై మంత్రి ఉత్తమ్‌ ఫైర్

ABN , Publish Date - Feb 27 , 2025 | 06:10 PM

Uttam Kumar Reddy: మాజీ మంత్రి హరీష్‌రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. .. పాలమూరు రంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నీరందించలేదని ధ్వజమెత్తారు.

Uttam Kumar Reddy: జగన్‌తో కుమ్మక్కై ..తెలంగాణకు అన్యాయం చేశారు..  హరీష్‌రావుపై మంత్రి  ఉత్తమ్‌  ఫైర్
Uttam Kumar Reddy

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు మాటలు పూర్తి అబద్దాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీళ్లు వచ్చేవని.. కానీ బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తి చేయకుండా వదిలిపెట్టారని మండిపడ్డారు. ఆ పనులు పూర్తి చేసి ఉంటే నల్గొండలో నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని అన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదాన్నిఅందరికీ చూడటానికి అనుమతిస్తున్నామని... ఎవరినీ తమ ప్రభుత్వం అడ్డుకోవడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న తమకు ఎలాంటి అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రెండు, మూడు నెలల్లో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు పున ప్రారంభిస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని అన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ అనుమతుల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఆప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.


కేసీఆర్ హయాంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చుపెట్టి నామమాత్రపు పనులు చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. వాళ్ల హయాంలో నీటిపారుదల శాఖను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావులకు దక్కుతుందని విమర్శించారు. తాము ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ముందుకు పోతున్నామని చెప్పారు. కేసీఆర్ హయాంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బ్లాస్ట్ జరిగి.. 9 మంది చనిపోతే ఒక్కరూ కూడా ఎందుకు పరామర్శకు రాలేదని ప్రశ్నించారు. ఆరోజు రేవంత్ రెడ్డి వస్తుంటే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని గుర్తుచేశారు. దేవాదులలో ఏడు మంది చనిపోతే.. వాళ్ల ఆస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయని చెప్పారు. హరీష్‌రావు ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడారా అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ అడిగే నాథుడే లేరన్నారు. ఇప్పుడు హరీష్‌రావు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.


బీఆర్ఎస్ ప్రభుత్వంలో జగన్‌తో కుమ్మక్కై ప్రగతిభవన్‌లో విందులు, వినోదాలు చేసుకుంటుంటే జగన్ కృష్ణానదిని దోచుకువెళ్లారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం రూ. 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నీరందించలేదని ధ్వజమెత్తారు. ఎస్ఎల్‌బీసీకి కరెంట్ కట్ చేస్తే డీ ఓటరింగ్ చేయలేక పనులు ఆగిపోయాయని చెప్పారు. అప్పుడు జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు ఏమి చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. హెలికాప్టర్‌లో తిరగాలని తనకు ఏ మాత్రం లేదని.. తాను గతంలో పైలట్‌ను అని గుర్తుచేశారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల కోసం అత్యంత నిపుణులు కలిగిన 11 ఏజెన్సీలను తీసుకువచ్చి సమర్థవంతంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు అబద్ధాలు అని.. ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Telangana MLC Elections: హోరాహోరీగా తెలంగాణలో ఎన్నిక.. కాంగ్రెస్, బీజేపీకి షాక్ తప్పదా

MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..

SLBC Incident: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆశలు వదులుకుంటున్న అధికారులు..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Feb 27 , 2025 | 06:36 PM