Home » President of india draupadi murmu
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాటికి స్వరాష్ట్రం సిద్ధించి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణ మరింత అద్భుత ప్రగతిని సాధించాలని వారు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షించారు.
పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.
Simultaneous polls: ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోనే హైలెవల్ కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(President of India Droupadi Murmu) అందజేశారు. ఈ నివేదికలో దేశంలో జమిలి ఎన్నికలు(Jamili Elections) సాధ్యమేనని కమిటీ స్పష్టం చేసింది. 2029 దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే..
Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై(ఒక దేశం - ఒకే ఎన్నిక)(One country - one Election) రూపొందించిన నివేదికను రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోని బృందం గురువారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము((President Draupadi Murmu)కు అందజేశారు. ఈ కమిటీ తన నివేదికలో కీలక వివరాలు పేర్కొంది. 2029లో దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనని..
Election Commission of India: సోషల్ మీడియాలో ఏదీ నమ్మే పరిస్థితి లేదు. ఇది నిజమో.. ఏది అబద్ధమో తేల్చుకునే లోపే.. అబద్ధం ప్రపంచమంతా చుట్టేస్తోంది. తాజాగా ఇలాంటిదే జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘంలో(Election Commission of India) ఒకే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ఉండగా.. ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని ఆధారంగా లబ్ధిపొందాలనుకున్న కేటుగాళ్లు.. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల నియామకం అంటూ ఫేక్ నోటిఫికేషన్(Fake Notification) సర్క్యూలేట్..
బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన విజయాలను బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. హిందువుల చిరకాల కోరిక రామ మందిర నిర్మాణం, చంద్రయాన్-3, జీ20 సమావేశాలు, ఏషియన్ గేమ్స్ నిర్వహించిందని గుర్తుచేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగం చదువుతారు. గత పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ప్రస్తావిస్తారు.
దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ఎగరేశారు. వేదిక దగ్గరికి చేరుకునే ముందే ఆమె.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి బయటకి వచ్చారు. అయితే ప్రతిసారిలాగా రాష్ట్రపతి బుల్లెట్ ప్రూఫ్ కార్లో కాకుండా.. అతిథితోపాటు ఒక గుర్రపు బగ్గీ(Horse Buggy)లో ఎక్కి వేదికవద్దకు చేరుకున్నారు.