Muneyya Nilayam : పెన్నాతీరం... మునెయ్య నిలయం
ABN , Publish Date - Nov 22 , 2024 | 11:29 PM
సుమారు 12 ఏళ్ల ప్రాయంలోనే యాగంటి నుంచి ప్రాద్దుటూరు రామేశ్వరానికి వచ్చిన దొంగకోళ్ల మునిస్వామిగా వ్యవహరించే మునెయ్య స్వామి తిరుణాళ్ల సోమవారం వేడుకగా నిర్వహించనున్నా రు.
మహిమాన్వితుడు మునెయ్యస్వామి
25న తిరుణాళ్ల
రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల రాక
ప్రొద్దుటూరు టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సుమారు 12 ఏళ్ల ప్రాయంలోనే యాగంటి నుంచి ప్రాద్దుటూరు రామేశ్వరానికి వచ్చిన దొంగకోళ్ల మునిస్వామిగా వ్యవహరించే మునెయ్య స్వామి తిరుణాళ్ల సోమవారం వేడుకగా నిర్వహించనున్నా రు. అవదూతగా, సిద్ధపురుషుడిగా పేరుపొందిన మునెయ్యస్వామి కార్తీక మాసం చివరి సోమవా రం సజీవ సమాధి అయిన రోజు కావడంతో ఆరోజున ప్రత్యేకించి తిరుణాళ్ల నిర్వహిస్తుంటారు. మునెయ్యస్వామి భక్తులపాలిట కొంగు బంగారంగా పేరుపొందారు. స్వామి మహిమల గురించి తెలియడంతో దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. రామేశ్వరంలోని పెన్నాతీరంలో వెలసిన మునెయ్యస్వామి ఆలయంలో 25వ తేదీ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తిరుణాళ్ల జరుగనుంది. మునెయ్య మునిస్వామి మహిమలు, మహత్యం గురించి విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో 400 ఏళ్ల కిందట మునెయ్యస్వామి సజీవ సమాధి అయ్యారని చరిత్ర చెబుతోంది.
మునెయ్యస్వామి చరిత్ర
స్వామి 12 ఏళ్లలోనే యాగంటిలో ఉండగా రాజరాజేశ్వరిదేవి అమ్మవారి దర్శనం అవడం, ఆమె ఆదేశానుసారం రామేశ్వరానికి వచ్చినట్లు పే ర్కొంటారు. ఇక్కడికి వచ్చిన ఆయన పాత కోట బయపురెడ్డి ఇంటికి వచ్చి వెళ్లేవారు. కురచగా ఉంగరాల జుట్టుతో గోచి మాత్రమే ధరించి బాలుడి రూపంలో పిల్లలతో కలిసి ఆడిపాడి అలసిపోయి రాజరాజేశ్వరిదేవి ఆలయంలో విశ్రాంతి తీసుకునేవారు.
ఆలయం ముందు భాగం
పెన్నాతీరం బాలుడి ఆటస్థలంగా మార డంతో తోటి పిల్లలతో గోలీలు, బొంగరాలు ఆడుతూ వారి బొంగరాలు పగులకొట్టేవాడు. ఇసుక తీసుకుని పిల్లల చేతిలో పోస్తే అది చక్కరగా మారేదని, అందుకే పిల్లలు ఎప్పుడూ ఆయన వెంట తిరిగేవారన్నారు. అయితే అప్పట్లో పెన్నాతీరం అడవిని పోలి ఉండ డంతో ఆ అడవిలో తిరిగే పులులు, పాములతో సరదాగా ఆడుకునేవాడు. ఆకలైతే కోళ్లను దొంగిలిం చి తీసుకెళ్లి తింటుండడంతో ఆయనను దొంగకోళ్ల మునిస్వామిగా పిలిచేవారు. మౌనవ్రతం చేపట్టి ఎవరితో మాట్లాకుండా ఉండడంతో ఆయనను మౌనిస్వామిగా పిలుస్తుండగా కాలక్రమంలో మునెయ్యస్వామిగా పిలుస్తున్నారు. మునెయ్యస్వామి అనుగ్రహంతో పుట్టిన పిల్లలకు మునెయ్య, మునెమ్మ, మునిరాజు పేర్లు పెట్టుకుని స్వామివారిని తమ ఇంటి దేవుడిగా భక్తులు కొలుస్తున్నారు. మునెయ్యస్వామి ఉన్నట్లుండి గాలిలో చూ స్తూ అదిలించేవారు. ఏమైం దని అడిగితే అడవిలో గోవులపై పులి దాడి చేయబోతే తరిమేశానని చెప్పేవాడు. రైతులు వర్షం కురవడంలేదని అడిగితే ఆ రోజు రాత్రే వర్షం కురిసేదంటారు. బయపురెడ్డి ఇంటికి వస్తుండడంతో ఆ ఇంటివారికి తన మహిమలు చూపి ఆ ఇంటి ఇలవేల్పుగా మారారు. స్వామి తన 40వ ఏట కార్తీక మాసం చివరి సోమవారం పాతకోట ఎల్లారెడ్డి స్థలంలో సజీవ సమాధి అయ్యారు. సమాధి అయ్యే ముందు ఆయన వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతూ భక్తులకు దర్శనమిస్తోంది.
నాటి నుంచి కార్తీక మాసం చివరి సోమవారం మునెయ్యస్వామి తిరుణాళ్లను నిర్వహిస్తున్నారు. తిరుణాళ్ల సందర్భంగా భక్తులు కోళ్లు, మేకలను బలి ఇస్తారు. కొందరు భక్తులు తలనీలాలు, పుట్టు వెంట్రుకలు స్వామివారికి ఇస్తారు. ఆలయం గోపురంపైన చెక్కిన శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఆలయం గోపురంపై గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ వంటి దేశ నాయకుల విగ్రహాలు దేశభక్తిని పెంపొందిస్తాయి. ఆలయం లోపల గోపికల వస్త్రాలను అపహరించే శ్రీకృష్ణుడి విగ్రహం, నంది విగ్రహం, ఆదిశేషునిపై విష్ణుమూర్తి, భూమిలో కుంగిన రథ చక్రాన్ని పైకి ఎత్తుతున్న కర్ణుడు వంటి శిల్పాలు ఆకట్టుకుంటాయి.
మహిళలే పూజారులు
పాతకోట మునెమ్మ వైవాహిక జీవితాన్ని త్యజిం చి ఆలయంలో మునెయ్యస్వామిని సుమారు వందేళ్లకు పై వయసులో కూడా పూజలు చేసేది. పాతకోట ఎల్లారెడ్డి స్థలంలో ఆలయం నిర్మించ డం, వారి ఇలవేల్పుగా నిలవడంతో పాలకోట వంశీకులే ఇప్పటికీ పూజారులుగా వ్యవహరిస్తు న్నారు. మొదటి తరంలో మునెమ్మ అనే భక్తురాలు స్వామివారిని సేవించేది. ఆలయ అభివృద్ధికి కృషిచేసేవారు. అప్పటి నుంచీ నేటి వరకూ మహి ళలే ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. సుమారు 360 ఏళ్లగా స్వామి వారి సేవ చేయడం తమ అదృష్టమని నేటి పూజారులు వివరి స్తుంటారు. కాగా స్వామి వారి సజీవ సమాధి పక్కనే ఒక పట్టె మంచం వేసి రాత్రికి పూలతో అలంకరించేవారు. తెల్లవారి చూస్తే ఒకరు పడుకు ని నిద్రపోయిన విధంగా పూలు నలిగి ఉంటాయి. ఇప్పటికీ ఇలాగే జరుగు తుండడం ఆయన మహిమలకు తార్కాణమని భక్తుల విశ్వాసం. ఇంతటి మహిమాన్వితుడు అప్పట్లో వాడిన వస్తువులు ఉన్నాయి. ఆంరఽధ, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు తిరుణాళ్ల సందర్భంలో స్వామివారి దర్శనానికి వస్తుంటారు.