Share News

Mission of EYE Rotary: నయనం రోటరీ ధ్యేయం

ABN , Publish Date - Nov 01 , 2024 | 11:18 PM

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు లేని జీవితం ముందుకు సాగలేదు. ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేవి కళ్లు. మన ఆలోచనలు, ఆరోగ్యానికి ప్రతిబింబాలు కళ్లు... రంగుల ప్రపంచాన్ని చూస్తూ... కోటి కాంతులను పంచుతూ... కలలను పండించుకోవాల్సిన కళ్లకు కమ్ముకున్న కాలుష్యం, పోషకాహార లేమితో నిర్జీవంగా మారుతున్నాయి.

Mission of EYE Rotary: నయనం రోటరీ ధ్యేయం
రోటరి కంటి ఆస్పత్రి

Eye-Head.gifవైద్యుల కృషి... సభ్యుల సేవ.. దాతల సహకారం

చీకటిని చీల్చే ‘నయన’కాంతులు

ప్రొద్దుటూరు రోటరీ కంటి ఆస్పత్రిలో పేదలకు మెరుగైన సేవలు

ప్రొద్దుటూరు రూరల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు లేని జీవితం ముందుకు సాగలేదు. ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేవి కళ్లు. మన ఆలోచనలు, ఆరోగ్యానికి ప్రతిబింబాలు కళ్లు... రంగుల ప్రపంచాన్ని చూస్తూ... కోటి కాంతులను పంచుతూ... కలలను పండించుకోవాల్సిన కళ్లకు కమ్ముకున్న కాలుష్యం, పోషకాహార లేమితో నిర్జీవంగా మారుతున్నాయి. పొడిబారడం, చూపు మందగించడం, శుక్లాలు వంటి సమస్యలకు గురవుతున్నాయి. ఇలాంటి ఎన్నో బాధలను గుర్తించి దాతల దాతృత్వం, ట్రస్టు సభ్యుల సేవ, వైద్యుల కృషితో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. వీటి ఫలితంగా 40 ఏళ్లుగా నిరుపేదలకు నయనాల వెలుగులను ప్రసాదిస్తోంది ప్రొద్దు టూరు రోటరీ కంటి ఆస్పత్రి. వివరాల్లోకెళితే....


022.gifసమస్యను పరిశీలిస్తున్న నిపుణులు

కంటి కటకం 35 శాతం ప్రొటీన్‌తోనూ 65 శా తం నీటితో నిండిఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ప్రొటీన్‌ క్షీణిస్తూ ముద్దలుగా తయారవు తుంది. ఐదు పదులు దాటిన సగం మందికి, ఏడు పదులు దాటిన 70 శాతం మందికి కంటి సమస్యలు మొదలవుతాయి. ఫలితంగా క్రమ క్రమంగా చూపు మసకబారుతుంది. చూపు పరిధిలో (ఫీల్డ్‌ ఆఫ్‌ విజన్‌) మధ్య ప్రాంతం మ సకబారుతుంది. రంగులు యధాతథంగా కన్పిం చవు. స్పష్టత లోపిస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ ప్రజలను పట్టి పీడిస్తుంటోంది. కంటి సమస్య నుంచి బయట పడాలంటే మహానగరాలకు వెళ్లాల్సి వస్తుండేది. అంతేకాకుండా అక్కడ వైద్యానికి అయ్యే ఖర్చు తడిసి మొపడయ్యేది. దీంతో 1985లో ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే కొప్పరపు సుబ్బారావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సోమిశెట్టి చిన్నసుబ్బరాయుడు, ప్రముఖ పారి శ్రామికవేత్త దేవరశెట్టి మోహన్‌రావు, పేదల కోసం రోటరీ సర్వీస్‌ కాంప్లెక్స్‌ ట్రస్టును స్థాపించారు. ఇక్కడ అప్పట్లోనే పేదలకు నాణ్యమైన వైద్యం, ఉచితంగా కంటి సేవలు అందించేవారు. ఎంతో మహోన్నతమైన సంకల్పంతో స్థాపించా రు. 2004లో సోమిశెట్టి చిన్నసుబ్బరాయుడు అల్లుడు గాథంశెట్టి రామక్రిష్ణ(యూఎస్‌ఏ), మరి కొందరు కలిసి ఈ ఆస్పత్రిని పునరుద్ధరించారు.


2005 నుంచి తాండవకృష్ణ, ఎంవీఎన్‌ ప్రభు, కోటా శివకుమార్‌ సహా మరో 13 మంది ఉచితంగా ఈ ట్రస్టు ద్వారా తమ అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. రోటరీ సర్వీస్‌ కాంప్లెక్స్‌ ట్రస్టు ద్వారా వందలాది మంది నిరుపేదలు ఉచితంగా కంటి వైద్యం పొందుతున్నారు. వైద్యసేవలు, శస్త్ర చికిత్స, ఉచితంగా ఆహారం, మందులు, కంటి అద్దాలను ఆస్పత్రి సమకూర్చుతుండడంతో పేదల కళ్లల్లో వెలుగులు నిండుతున్నాయి.

ఆధునిక వైద్యసేవలు

రోటరీ కంటి ఆస్పత్రి పరిసరాలు శుభ్రంగా కార్పొరేట్‌ స్థాయికి దీటుగా ఉన్నాయి. రోటరీ కంటి ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు, 20 మంది సిబ్బంది నిత్యం వైద్యసేవలు అందిస్తున్నారు. 20 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రి పేదలకు ఉచిత వైద్యం అందించడమేకాక ధనవంతులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన శస్త్ర చికిత్సను కూడా చేపడుతున్నారు. ఆస్పత్రిలో రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. ఇందులో అత్యాధునిక వసతులతో కూడిన ఆపరేషన్‌ థియేటర్‌, కంటి విభాగానికి సంబందించిన ఆధునిక పరికరాలైన ఏఆర్‌ మిషన్‌, ఎస్కాన్‌, లాన్సోమీటర్‌, స్కిట్‌ల్యాంప్‌, ఫ్యాకో ఎమల్సిఫికేషన్‌ సర్జరీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆధునిక పరికరాలతో శస్త్రచికిత్స, సమర్ధవంతమైన వైద్యుల నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి.


ప్రతినెల మొదటి ఆదివారం నంద్యాలకు చెందిన రెటీనా వైద్యుడు డాక్టర్‌ క్రాంతి ఇక్కడ ఉచితంగా కంటి పరీక్షలు, నిర్ధారణ చికిత్స నిర్వహిస్తున్నారు. అంతేకాక ట్రస్టు ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో ఆర్థోపెడిక్‌, జనరల్‌ మెడిసిన్‌ విభాగాలవైద్యశిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు. ఓపీ విభాగంలో ప్రతినెల సుమారు 3 వేల మంది ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. నెలకు సుమారు 300 ఆపరేషన్లు చేస్తున్నారు. శస్త్ర చికిత్స సమయంలో ఉచితంగా రక్త పరీక్షలను ఆస్పత్రిలోనే నిర్వహిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది జీతభత్యాలు అందుతుండగా, ట్రస్టు సభ్యులందరూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పేదలకు సేవా భావంతో ఉచిత సేవలు అందిస్తున్నారు.

పేదల సేవే పరమావధి

రోటరీ కంటి ఆస్పత్రిలో దాదాపుగా 40 ఏళ్లుగా పేదలకు ఉచిత కంటి వైద్యసేవలు నిర్వహిస్తున్నారు. రేషన్‌కార్డు ఉన్నవారికి ఉచిత వైద్యసేవలు, శస్త్ర చికిత్స, ఉచితంగా ఆహారం, మందులు, కంటి అద్దాలు అందిస్తున్నాం. సభ్యుల సేవాభావం చాలా గొప్పది. నేను 15 ఏళ్లగా ఇక్కడ సేవలను అందిస్తున్నాను. పేదలకు సేవ చేయడమే ట్రస్టు ముఖ్య ఆశయం.

కోటా శివకుమార్‌, రోటరీ కంటి ఆస్పత్రి ప్రెసిడెంట్‌, ప్రొద్దుటూరు.

Updated Date - Nov 01 , 2024 | 11:18 PM