Home » Raghunandan Rao
సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రార్థనా మందిరం నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నిర్మాణాన్ని అడ్డుకొని గోడ కూల్చారంటూ ఓ వర్గంపై మరో వర్గం కుకూనురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టుయిన వారికి బీజేపీ ఎంపీ ఆర్ రఘునందన్‌రావు మద్దతుగా నిలిచారు.
జన్వాడ ఫాంహౌ్‌సలో రేవ్ పార్టీపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫాంహౌస్ ఎవరిదైనా దర్యాప్తు జరపాల్సిందేనన్నారు.
కేటీఆర్ బామ్మర్ది రాజ్ ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ నిర్వహించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో.. బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో.
‘‘భయపడకండి.. మీ ఇళ్లను ఎవ్వరూ కూల్చరు.. మీకు బీజేపీ అండగా ఉంటుందని గోల్నాక డివిజన్లోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు(Medak MP Raghunandan Rao) భరోసా ఇచ్చారు.
ముత్యాలమ్మ దేవాలయం ఘటనలో అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బంగ్లాదేశ్ స్లీపర్స్ సెల్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇది పోలీసులకు సమాజానికి మంచిది కాదని అన్నారు. రాజకీయ అవసరం కోసం దీనిని డైవర్ట్ చేయొద్దని అన్నారు.
మంత్రి కొండా సురేఖ ఫొటోను మార్ఫింగ్ కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
శ్రీవారి ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ముగింపునివ్వాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరారు.
అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖకు కండువా కప్పానని, దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలను కంట్రోల్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.
జిల్లా ఇన్చార్జి మంత్రిగా తాను మెదక్ వెళ్లినప్పుడు.. చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే..
కేసీఆర్ అవినీతి లక్ష కోట్లను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కక్కిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారని.. కానీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జి దొరకలేదా? రిటైర్ అయిన జడ్జితో సిట్ వేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.