Raghunandan Rao: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ABN , Publish Date - Jan 20 , 2025 | 02:51 PM
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం పోయాక కేటీఆర్ రైతు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్‌కు అవమానం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు గుర్తుచేశారు.

సంగారెడ్డి: పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయని.. చెల్లె కవిత ఇప్పటికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంది... మంచి డాక్టర్‌కు చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని ఎంపీ రఘునందన్ రావు సలహా ఇచ్చారు. మొదటగా ఆమె ఆస్పత్రిలో చూయించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ...
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కేటీఆర్‌కు రైతులు గుర్తుకు రాలేదా అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయాక రైతులపై కేటీఆర్‌కు ప్రేమ పెరిగిందా అని ప్రశ్నించారు. అధికారం పోయాక కేటీఆర్ రైతు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్‌కు అవమానం జరిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్‌ను గౌరవించలేదని అన్నారు. కేవలం అంబేద్కర్ జయంతి, వర్ధంతులు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదని ఎంపీ రఘునందన్ రావు ఆక్షేపించారు.
1950 లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల్లోని ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు, తుంగలో తొక్కారని ఆక్షేపించారు. ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కాదని యూపీఏ చైర్ పర్సన్‌గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు. అధికారంలో లేనప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.
రేవంత్ పాలన అవినీతి మయంగా మారింది: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిజామాబాద్: రేవంత్ ప్రభుత్వ పాలన పూర్తి అవినీతి మయంగా మారిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ సంవిధాన గౌరవ్ దివస్‌పై ఇవాళ(సోమవారం) వర్క్ షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పసుపు బోర్డు దేశానికే గర్వకారణమని చెప్పారు. పసుపు బోర్డు సాధించిన ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 13 కుంభకోణాలు జరిగాయని.. వాటిని ఆధారాలతో సహా బయట పెట్టినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్.అర్.బి.ఎం పరిధిని దాటి విపరీతంగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ని అప్పులు చేసినప్పటికీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఎందుకు పూర్తిగా అమలు చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం పనిచేస్తే , బీజేపీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
KTR: అన్నీ కటింగ్‌లు.. కటాఫ్‌లే.. కేటీఆర్ విమర్శనాస్త్రాలు
Hyderabad: నాలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ చేస్తున్న దొంగల ముఠా..
Davos: సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన
Read Latest Telangana News And Telugu News