Share News

Ambulance Tragedy: రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం

ABN , Publish Date - Feb 02 , 2025 | 12:18 PM

అతనో చేనేత కార్మికుడు.. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో మృతిచెందగా.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో మృతదేహాన్ని రాత్రంతా రోడ్డుపై అంబులెన్స్‌లోనే ఉంచి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు తరలించిన హృదయ విదారకర ఘటన చూపరులను కలచి వేసింది.

Ambulance Tragedy: రాత్రంతా అంబులెన్స్‌లోనే  మృతదేహం
Ambulance Tragedy

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ కుటుంబానికి గూడులేక మృతదేహంతో (Dead body) రాత్రంతా అంబులెన్స్‌లోనే (Ambulance) గడిపింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నేత కార్మికుడు (Handloom worker) బిట్ల సంతోష్ (Bitla Santosh) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సిద్దిపేట ఆసుపత్రి (Siddipet Hospital)లో మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని ఉంచడానికి సొంతిల్లు లేకపోవడంతో రాత్రంతా రోడ్డుపై అంబులెన్స్‌లోనే ఉంచి కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరులను కలచి వేసింది. గ్రామస్తుల సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ వార్త కూడా చదవండి..

ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం


వివరాల్లోకి వెళితే..

మృత దేహాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో దవాఖాన నుంచి వచ్చిన మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి అంత్యక్రియలకు తరలించిన హృదయ విదారకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలకేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన చేనేత కార్మికుడు బిట్ల సంతోష్‌(48)కు భార్య శారద, ఇద్దరు కూతుళ్లు వైశాలి, దీపిక, కొడుకు సాయి ఉన్నారు. వారి ఇల్లు శిథిలమవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సంతోష్‌ గతీ కొంత కాలంగా క్యా న్సర్‌తో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు సిద్దిపేటలోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి సంతోష్‌ మృతిచెందాడు. కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో ముస్తాబాద్‌లోని తమ పాత ఇంటికి వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని అక్కడ ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాత్రంతా అంబులెన్స్‌లోనే ఉంచారు. భార్య, ముగ్గురు పిల్లలు కూడా చలిలోనే బయటే ఉండిపోగా, వారి పరిస్థితిని చూసి గ్రామస్తులు చలించిపోయారు. శనివారం ఉదయం అంబులెన్స్‌ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి అంత్యక్రియలకు తరలించారు.


బాధిత కుటుంబానికి ఇల్లు..

బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జి కేకే మహేందర్‌ రెడ్డి.. కలెక్టర్‌తో మాట్లాడారు. వెంటనే స్పందించిన ఆయన ఇందిరమ్మ కాలనీలో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఆ కుటుంబానికి కేటాయించాలని తహసీల్దార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌ సురేశ్‌ సంతోష్‌ కుటుంబ సభ్యులకు రెండు పడక గదుల ఇల్లు కేటాయించి తాళాలను అందజేశారు. సఖి కేంద్రం బాధ్యులు పిల్లల వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు వారి కుటుంబ దీనస్థితిని చూసి పలువురు స్పందించి ఆర్థిక సాయం అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..

మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా

ఢిల్లీలోని సహద్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రధసప్తమి వేడుకలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 02 , 2025 | 12:18 PM