Home » Ramnath Kovind
న్యూఢిల్లీ: 'ఒక దేశం ఒకే ఎన్నిక' కమిటీపై కేంద్ర న్యాయశాఖ ఆదివారంనాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను నియమించింది. సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, ఎన్‌కే సింగ్, డాక్టర్ సుభాష్ ఎస్.కస్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి నియమితులయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విధానం ఆచరణ సాధ్యమేనా? దీనిని అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలేమిటి?