Home » Revanth Reddy
మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో జరిగిన ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఘటన గురించి ఎంపీకి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రతను మరింత పెంచాలని పోలీసులను ఆదేశించారు.
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి గురు ప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన సంఘటనలో 16 రోజుల నిరీక్షణ తరువాత ఓ మృతదేహం లభించడం అత్యంత బాధాకరమన్నారు.
అఖిలభారత పద్మశాలి మహాసభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం కనీసం నివాళులు కూడా అర్పించకపోవడాన్ని పద్మశాలి సమాజం మరిచిపోలేదని రేవంత్ వ్యాఖ్యానించారు.
New Ration Card Issue Date: తెలంగాణ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త రేషన్ కార్డులు జారీకి ముహూర్తం ఖారారు చేశారు. అలాగే ఈ కార్డు రంగుతోపాటు రూపు రేఖలు మారనుండే విధంగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Telangana CM Change: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు తథ్యమని తెలంగాణ ఎమ్మెల్యే స్సష్టం చేశారు. ఆ ఆపరేషన్ కోసమే తెలంగాణ కొత్త ఇన్ ఛార్జీగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేట్టారని స్పష్టం చేశారు. మరికొద్ది మాసాల్లో ఈ సీఎం మార్పు ఉంటుందన్నారు. అలాగే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకకుండా ఆయన కేబినెట్లోని మంత్రి కీలకంగా వ్యవహరిస్తున్నారని గుట్టు విప్పారు.
K Rammohan Naidu: వరంగల్లోని మామునూరు ఎయిర్ పోర్ట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత రెడ్డి చేస్తున్న ప్రకటనలపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో స్పందించారు. విమానాశ్రయాలను నిర్మించేది రాష్ట్ర ప్రభుత్వాలు కాదంటూ సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు.
కేంద్రం గత పదేళ్లలో తెలంగాణకు పది లక్షల కోట్లు ఇచ్చిందని, రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటామని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
CM Revanth Reddy: మోదీ ప్రభుత్వంతోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి వ్యవహార శైలిని ఆయన ఎండగట్టారు.
TGS RTC MahaLakshmi: రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలో ఆర్టీసీ సిబ్బంది.. పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసే ముందు విధి విధానాలు ఖరారు చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. నాంపల్లిలోని కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పలు కేసులు సీఎం రేవంత్ రెడ్డిపై నమోదయ్యాయి. దాంతో గురువారం నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.