Home » Rohit Sharma
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. దేని గురించైనా ధైర్యంగా కామెంట్ చేస్తాడు. అలాంటోడు తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తమను తిట్టే హక్కు వాళ్లకు ఉందన్నాడు.
ఈతరం క్రికెటర్లలో బాదుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మే. తొలి బంతి నుంచి బౌండరీలు, సిక్సులతో శివాలెత్తడం అతడికి అలవాటు. అయితే హిట్‌మ్యాన్‌ను మించిపోయేలా బాదుడుకు కొత్త డెఫినిషన్ ఇస్తూ ఓ మహిళా క్రికెటర్ అద్భుతంగా ఆడింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రాబోయే ఆస్ట్రేలియా టూర్లో ఆడటం అనుమానంగా మారింది. దీంతో అతడి ప్లేస్‌లో ఎవర్ని తీసుకోవాలనే దానిపై సెలెక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంపై తాజాగా హిట్‌మ్యాన్ సతీమణి రితికా సజ్దే రియాక్ట్ అయింది.
టీమిండియాలో స్పెషల్ టాలెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంజూ శాంసన్. అయితే ఇన్నాళ్లూ సరైన అవకాశాలు లేక సతమతమైన ఈ కేరళ సెన్సేషన్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొడుతున్నాడు.
ఒక్క సిరీస్.. ఒకే ఒక్క సిరీస్ భారత క్రికెట్లో లెక్కలన్నీ మార్చేస్తోంది. నిన్నటి వరకు జట్టులో చక్రం తిప్పిన వారు.. ఇప్పుడు బలిపీఠంపై కూర్చోవాల్సిన పరిస్థితి. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని అందరితో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. అయితే టీమ్‌లో అతడికి అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా సూర్యకుమార్ యాదవ్‌ను చెప్పొచ్చు.
అసలే న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలాంటి తరుణంలో అతడికి మరింత తలనొప్పి తెప్పిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
తన భార్య రితికా డెలివరీ దృష్ట్యా త్వరలోనే ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ గైర్హజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కెప్టెన్ కచ్చితంగా ఉండాల్సిందేనని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. అయితే సునీల్ గవాస్కర్ అభిప్రాయాన్ని ఆసీస్ మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఖండించాడు.
Rohit-Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద విమర్శల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్ సిరీస్‌లో వాళ్లు ఆడిన తీరు మీద సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. సీనియర్ క్రికెటర్లు కూడా స్టార్లపై విరుచుకుపడుతున్నారు.
కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు తమ ఫామ్‌ను మార్చుకోవాలంటే వీఐపీ సంస్కృతిని మరచిపోయి దేశవాళీ క్రికెట్లో ఆడాలని కైఫ్ సూచించాడు.