Share News

Suryakumar Yadav: రోహిత్ సావాసంతో అదే నేర్చుకున్నా.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Nov 08 , 2024 | 09:03 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని అందరితో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. అయితే టీమ్‌లో అతడికి అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా సూర్యకుమార్ యాదవ్‌ను చెప్పొచ్చు.

Suryakumar Yadav: రోహిత్ సావాసంతో అదే నేర్చుకున్నా.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఛాలెంజ్‌కు రెడీ అయిపోయాడు. తాను సారథిగా వచ్చాక మొదటి సవాలైన శ్రీలంకలో టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. ఇప్పుడు సౌతాఫ్రికా రూపంలో అతడి ముందు మరో ఛాలెంజ్ రెడీగా ఉంది. నాలుగు టీ20ల సిరీస్ కోసం టీమ్‌తో కలసి ప్రొటీస్‌కు వచ్చాడు సూర్య భాయ్. ఇవాళ జరిగే మ్యాచ్‌తో ఈ సిరీస్‌ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు సూర్య. సిరీస్‌ సన్నద్ధతతో పాటు టీమ్‌కు సంబంధించిన పలు విషయాలను కూడా అతడు పంచుకున్నాడు. అలాగే వన్డే, టెస్ట్ సారథి రోహిత్ శర్మతో తన అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


హిట్‌మ్యాన్‌కు తెలుసు

రోహిత్ తనకు చాలా స్పెషల్ అన్నాడు సూర్యకుమార్. అతడి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి అతడితో కలసి ఆడుతున్నానని అన్నాడు. అప్పటి నుంచి అతడి సారథ్యంలో ఆడుతున్నానని.. ఇటీవల బిగ్ టోర్నమెంట్స్‌లో కూడా కలసి ఆడామన్నాడు. ఎన్నో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రోహిత్‌తో ఆడానని.. అతడు ప్లేయర్లను ఎలా ట్రీట్ చేస్తాడు, వాళ్ల నుంచి ఏం కోరుకుంటాడనేది తనకు తెలుసునని సూర్య పేర్కొన్నాడు. అతడి నుంచి తాను అదే నేర్చుకున్నానని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లతో ఎలా మెలగాలి, వాళ్ల టాలెంట్‌ను ఎప్పుడు, ఎలా వాడుకోవాలనేది తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా రోహిత్ చాలా సక్సెస్ అయ్యాడని వివరించాడు. అతడి నుంచి పలు విషయాలు నేర్చుకున్నప్పటికీ తన సారథ్యంలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించాడు సూర్య.


రోహిత్ ప్రోత్సాహంతోనే..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని అందరితో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా అందర్నీ ఒకేలా ట్రీట్ చేస్తుంటాడు. గ్రౌండ్‌లో అతడు ప్లేయర్లతో కలసిపోయే తీరు, జోక్స్ వేస్తూ వాళ్లను నవ్వించే తీరు, ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించే విధానాన్ని బట్టే ఇది అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత టీమ్‌లో అందరితో బాగానే ఉన్నా హిట్‌మ్యాన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ సారథిగా ఉన్నప్పుడే సూర్య టీమ్‌లోకి వచ్చాడు. అతడు ఈ స్థాయికి చేరుకోవడంలో హిట్‌మ్యాన్ ప్రోత్సాహం ఎంతో ఉంది. అందుకే రోహిత్‌తో తన ఉన్న అనుబంధం గురించి సూర్య అప్పుడప్పుడు ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉంటాడు.


Also Read:

శుభవార్త చెప్పిన కేఎల్ రాహుల్ జంట.. ఖుషీలో అభిమానులు

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇలాంటి ఆట పాక్‌కే సాధ్యం

కావాలనే సచిన్ కాళ్లు మొక్కించారు.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

For More Sports And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 09:23 PM