Train: రైలులో బాలికపై అఘాయిత్యం..
ABN , Publish Date - Apr 05 , 2025 | 09:13 AM
రైలులో ప్రయాణిస్తున్న బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వీడియో కూడా తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో తోటి ప్రయాణికుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

- వీడియో చిత్రీకరణ..
- బాలిక తండ్రి ఫిర్యాదు
- నిందితుడిపై పోక్సో కేసు నమోదు
సికింద్రాబాద్: కుటుంబంతో రైలులో ప్రయాణిస్తున్న బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లగా తోటి ప్రయాణికుడు, బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వీడియో తీశాడు. రక్సెల్ ఎక్స్‌ప్రెస్(Raxel Express)లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాలిక తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంబల్‌పూర్ ప్రాంతానికి చెందిన బాలిక కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చేందుకు రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ మెట్రోకు యూరోపియన్ వ్లాగర్ ఫిదా..
అదే కోచ్‌లో (బెర్త్ నెంబర్ 6)బీహార్ మంద్వాడ్ జిల్లా ఖజోలి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ (21) కూడా ప్రయాణిస్తున్నాడు. రైలు కేల్తార్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉండగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాలిక బాత్‌రూమ్‌కు వెళ్లింది. బాలికపై కన్నేసిన సంతోష్‌కుమార్ ఆమె వెంటే వెళ్లాడు. బాలికను బలవంతంగా బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి వీడియో, ఫొటోలు కూడా తీసుకున్నాడు. భయపడిన బాలిక ఉదయం 8 గంటల ప్రాంతంలో నిద్ర లేచిన తల్లిదండ్రులకు లైంగికదాడి, వీడియోల గురించి చెప్పింది.
వెంటనే అప్రమత్తమైన బాలిక తండ్రి రైల్వే హెల్ప్‌లైన్ 139 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రైలు సికింద్రాబాద్‌కు చేరుకోగానే నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. లైంగిక దాడి ఘటన ఇటార్సీ రైల్వే స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును ఇటార్సీ రైల్వే పోలీసులకు బదిలీ చేస్తున్నామని సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..
Read Latest Telangana News and National News