Share News

Trains: జూన్‌ చివరి వారం వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:21 AM

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో ప్రత్యేక రైళ్లను జూన్‌ చివరి వారం వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆ పొడిగించిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

Trains: జూన్‌ చివరి వారం వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

హైదరాబాద్‌: ప్రయాణికుల డిమాండ్‌ మేరకు పలు ప్రత్యేక రైళ్లను జూన్‌ చివరి వారం వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. హైదరాబాద్‌-రాక్సల్‌, సికింద్రాబాద్‌-రాక్సల్‌, చర్లపల్లి -రాక్సల్‌, సికింద్రాబాద్‌-ధన్‌పూర్‌(Secunderabad-Dhanpur), చర్లపల్లి- ధన్‌పూర్‌ మధ్య నడిచే రైళ్లను జూన్‌ చివరి వారం వరకు పొడిగించినట్టు తెలిపారు. అలాగే సోలాపూర్‌-ఎల్‌టీటీ ముంబై, తిరుపతి-సోలాపూర్‌ మధ్య నడిచే ప్రత్యేకరైళ్లను ఏప్రిల్‌ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్టు వివరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Harish Rao: సీఎంగారూ.. రంజాన్‌ తోఫాలు ఏవండీ..


సికింద్రాబాద్‌-దర్భంగా రైళ్ల రద్దు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధి కొటార్లియా స్టేషన్‌లో నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఏప్రిల్‌ 8, 11, 12, 15, 18, 19, 22, 25తేదీల్లో సికింద్రాబాద్‌-దర్భంగా (17007-17008) రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు మరో ప్రకటనలో తెలిపారు.

జూన్‌ 15నుంచి చర్లపల్లి టెర్మినల్‌ నుంచి ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు

ఇప్పటి వరకు హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18045- 18046) రైలు హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించగా జూన్‌ 15నుంచి చర్లపల్లి టెర్మినల్‌ నుంచి రాకపోకలు ప్రారంభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.


గుంటూరు-హుబ్లీ మధ్య ఉగాది ప్రత్యేక రైళ్లు

ఉగాది పర్వదిన సందర్భంగా గుంటూరు- హుబ్లీల మధ్య మార్చి 31, ఏప్రిల్‌ 1న ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. మార్చి31న గుంటూరు-ఎస్ఎస్ఎస్‌ హుబ్లీ (07271), ఏప్రిల్‌ 1న ఎస్‌ఎస్ఎస్‌ హుబ్లీ-గుంటూరు (07272) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వారు పేర్కొన్నారు.


మే 23నుంచి వారం పాటు 30రైళ్లు రద్దు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని మహబూబాబాద్‌ స్టేషన్‌లో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు చేపడుతున్నందున మే నెల 23వ తేదీనుంచి 29వరకు సుమారు 30రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. అలాగే, మరో 4 రైళ్ల వేళల్లో మార్పులు చేయగా, 35రైళ్లకు ఆయా తేదీల్లో మహబూబాబాద్‌ స్టేషన్‌లో స్టాపేజీని ఎత్తివేశామని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్‌ గద్దలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..

పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2025 | 11:21 AM