Home » Seethakka
గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూఠీ చేసిందని మంత్రి సీతక్క అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఫైర్ అయ్యారు.
ములుగు జిల్లా గణతంత్ర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వాడలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.
Telangana: అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ కేటీఆర్ అనేక సార్లు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అలాగే మంత్రులు కూడా కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టే పనిలో పడ్డారు. తాజాగా కేటీఆర్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు.
Telangana: మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి పశువులను తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ( Central Govt ) మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని.. అందుకోసం తెలంగాణ తరఫున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ( Minister Kishan Reddy ) కృషి చేయాలని మంత్రి సీతక్క ( Minister Seethakka ) కోరారు.
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు.
భారత్‌కి కాంగ్రెస్ నాయకత్వం అవసరమని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం నాడు మంత్రి సీతక్క ( Minister Sitakka ) మీడియాతో మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు నిర్మాణాత్మక సూచనలను ఏఐసీసీ అగ్రనేతలు ఇచ్చారన్నారు.
ప్రస్తుతం 5 కోట్లతో కడెం ప్రాజెక్టు తాత్కాలిక మరమ్మత్తులు చేపడుతున్నామని మంత్రి సీతక్క ( Minister Seethakka ) తెలిపారు. బుధవారం నాడు కడెం ప్రాజెక్టును మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సందర్శించి పరిశీలించారు.
Telangana: ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులలో మహిళల ఉచిత ప్రయాణాన్ని బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు గట్టిగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
జనవరి 26వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ఇంద్రవెల్లిలో పర్యటిస్తారని మంత్రి సీతక్క ( Minister Seethakka ) తెలిపారు. సోమవారం నాడు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRDలో సీఎం రేవంత్ చర్చించారు.