Share News

Video Morphing: వీడియోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 03 , 2024 | 04:12 AM

మంత్రి సీతక్కపై శాసనసభ ప్రాంగణం, హాలులో వీడియోలు తీసి, వాటిని మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. వీడియోలు మార్ఫింగ్‌ చేయడం ఎంతో దుర్మార్గమైన, సిగ్గులేని చర్య అని అన్నారు.

Video Morphing: వీడియోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు

  • దుర్మార్గపు చర్య.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మంత్రి సీతక్కపై శాసనసభ ప్రాంగణం, హాలులో వీడియోలు తీసి, వాటిని మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. వీడియోలు మార్ఫింగ్‌ చేయడం ఎంతో దుర్మార్గమైన, సిగ్గులేని చర్య అని అన్నారు. శుక్రవారం శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. సభా కార్యకలాపాలను అవమానపరిచే విధంగా వీడియోలు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


దానిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందిస్తూ... వీడియోలు మార్ఫింగ్‌ చేసి, శాసనసభ ప్రతిష్ఠను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, మంత్రి సీతక్కకు సంబంధించిన వీడియోను మార్ఫింగ్‌ చేసి, సౌండ్‌ మార్చి ఎక్స్‌ ఖాతాలో సర్క్యులేట్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకుడు వెంకట్‌ నాయక్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐటీఏ 2000, 200, 79, 33,(4), 353(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Updated Date - Aug 03 , 2024 | 04:12 AM