Home » Seethakka
తెలంగాణలో రోడ్డు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహించే మహిళాశక్తి క్యాంటిన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని, వాటిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
చేర్యాల(Cheryala) మండలం కమలాయపల్లి( Kamalayapally) గ్రామంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగపూరి రాజలింగంతో కలిసి ఆమె ఆవిష్కరించారు.
హైదరాబాద్ మియాపూర్‌లోని ఏటిగడ్డతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన గిరిజన బాలిక (12) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
హైదరాబాద్(Hyderabad) నడిగడ్డతండా(Nadigadda Tanda)లో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని మంత్రి సీతక్క(Minister Seethakka) పరామర్శించారు. మరిపెడ మండలం ఎల్లంపేటలోని బాధిత గిరిజన కుటుంబాన్ని మంత్రి సీతక్క స్వయంగా వెళ్లి ఓదార్చారు.
తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేయడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, దారుణానికి పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం(సమ్మక్కసాగర్) బ్యారేజీ నీటి వినియోగం/లభ్యతపై తాజాగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తెలంగాణను కోరింది. ఈమేరకు నీటిపారుదల శాఖ అధికారులకు సీడబ్ల్యూసీ లేఖ రాసింది.
అమరులు, ఉద్యమకారుల ఆశయాలు ఫలించే పాలన రాష్ట్రంలో ఆరంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న స్వేచ్ఛాయుత పాలన అమల్లోకి వచ్చిందన్నారు. సోమవారం హనుమకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు.