Singareni Election Result Live Updates: ఇప్పటివరకు ఏ సంఘం ఎన్ని స్థానాల్లో గెలిచిందంటే.. శ్రీరాంపూర్ ఫలితంపై ఉత్కంఠ
ABN , First Publish Date - Dec 27 , 2023 | 06:04 PM
సాధారణ ఎన్నికలను తలపించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్త్ మధ్య లెక్కింపు జరుగుతోంది.
Live News & Update
-
2023-12-28T00:03:59+05:30
ఇప్పటివరకు ఇల్లందు, కొత్తగూడెం కార్పొరేటు ఏరియా, మణుగూరు, రామగుండం-3, ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. ఇక బెల్లంపల్లి, రామగుండం-1, రామగుండం-2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది.
-
2023-12-27T21:45:52+05:30
మంచిర్యాల: సింగరేణి ఎన్నికల్లో శ్రీరాంపూర్ ఏరియా కీలకంగా మారింది. ఇక్కడ కౌంటింగ్ కొనసాగుతోంది. 8,491 ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఇక్కడ వెలువడనున్న ఫలితంపై తీవ్రం ఉత్కంఠ నెలకొంది. అయితే ఫలితం ప్రకటించడానికి మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా కౌంటింగ్ కేంద్రం వద్దకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్యకర్తలు వందల సంఖ్యలో చేరుకున్నారు.
-
2023-12-27T21:22:49+05:30
బెల్లంపల్లి ఏరియాలో ఏఐటీయూసీ విజయం సాధించింది. 112 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. బెల్లంపల్లి ఏరియాలో మొత్తం 959 ఓట్లు పడగా హెచ్‌ఎంఎస్ - 61, బీఎంఎస్ -06, టీబీజీకేఎస్ -03, సీఐటీయూ -11, ఏఐటీయూసీ -497, ఐఎన్‌టీయూసీ -375, తిరస్కరించిన ఓట్లు -03 చొప్పున వచ్చాయి.
-
2023-12-27T21:15:44+05:30
భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేటు ఏరియాలో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేట్ ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ యూనియన్ 288 ఓట్లతో విజయం సాధించింది. ఓట్ల లెక్కింపులో ఐఎన్‌టీయూసీకి -549, బీఎంఎస్ -261, ఏఐటీయూసీ -253, సీఐటీయూ - 42, టీబీజీకేఎస్ -32, హెచ్ఎంఎస్-04 చొప్పున ఓట్లు పడ్డాయి.
-
2023-12-27T20:58:11+05:30
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తొలి విజయం ఐఎన్‌టీయూసీ ఖాతాలో పడింది. ఇల్లెందులో 46 ఓట్ల తేడాతో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. ఐఎన్‌టీయూసీకి 310 ఓట్లు, ఏఐటీయూసీకి 264 ఓట్లు పడ్డాయి. దీంతో 46 ఓట్ల మెజారిటీతో ఐఎన్‌టీయూసీ గెలుపొందింది.
-
2023-12-27T20:31:43+05:30
కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఐఎన్‌టీయూసీ ముందంజ
-
2023-12-27T20:15:48+05:30
మరో అర గంటలో కౌంటింగ్ ఫలితాలు మొదలయ్యే అవకాశం
-
2023-12-27T19:45:59+05:30
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో నమోదయిన పోలింగ్ శాతం.. డివిజన్ల వారీగా..
-
2023-12-27T19:35:59+05:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. 12 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 69 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్ పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్ సింగరేణి కార్యాలయంలో బూత్ నెం 5 ఓట్లు లెక్కిస్తున్నారు. డిప్యూటీ సీఎల్‌సీ పర్యవేక్షిస్తున్నారు.
-
2023-12-27T19:02:32+05:30
సింగరేణి ఓట్ల లెక్కింపు ప్రారంభం
11 కేంద్రాల్లో సింగరేణి ఎన్నికల ఓట్ల లెక్కింపు
బ్యాలెట్ పద్ధతిలో జరిగిన సింగరేణి ఎన్నికలు
సింగరేణి ఎన్నికల్లో 96.3% పోలింగ్ నమోదు
అర్ధరాత్రి వరకు వెలువడనున్న తుది ఫలితం
-
2023-12-27T18:57:48+05:30
తొలి ఫలితం వచ్చేది ఎక్కడంటే..?
- సింగరేణి ఎన్నికల పోలింగ్‌కు పోటెత్తిన కార్మికులు
- 94.20 శాతం పోలింగ్ నమోదు
- మొత్తం 11 ఏరియాల్లో 39773 ఓట్లకు 37468 పోలైన ఓట్లు
- రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
- 12 కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు
- ఇల్లందు ఏరియాలో తొలి ఫలితం
-
2023-12-27T18:51:06+05:30
-
2023-12-27T18:48:47+05:30
మంచిర్యాల: సింగరేణి ఎన్నికల పోలింగ్
శ్రీరాంపూర్ 93 శాతం నమోదు
బెల్లంపల్లి ఏరియా 96.3 శాతం నమోదు
మందమర్రి ఏరియా 93.38 శాతం నమోదు
-
2023-12-27T18:45:49+05:30
సింగరేణి పోల్ పర్సంటేజ్ వివరాలు
1. కొత్తగూడెం ఏరియా 94.88
2. ఇల్లందు ఏరియా 98.53
3. మణుగూరు 98.50
4. కార్పొరేట్ ఏరియా 96.47
-
2023-12-27T18:38:50+05:30
ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం
- రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న సింగరేణి ఓట్ల లెక్కింపు
- బ్యాలెట్ పద్ధతిలో జరిగిన సింగరేణి ఎన్నికలు
- 84 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన సింగరేణి ఎన్నికలు
- 11 కేంద్రాల్లో జరగనున్న సింగరేణి ఎన్నికల ఓట్ల లెక్కింపు
- సింగరేణి ఎన్నికల బరిలో 13 గుర్తింపు కార్మిక సంఘాలు
-
2023-12-27T18:20:18+05:30
6 జిల్లాల పరిధిలో మొత్తం 11 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. 13 కార్మికల సంఘాలు బరిలో ఉన్నప్పటికీ సీఐటీయూసీ - ఏఐటీసీయూ మధ్యే ప్రధానమైన పోటీ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.ఫలితాలు వచ్చే అవకాశముంది.
-
2023-12-27T18:12:34+05:30
భూపాలపల్లి సింగరేణిలో 94.7 శాతం పోలింగ్ నమోదయింది. 5410 ఓట్లకు గాను 5,123 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిన్న చిన్న ఘటనలు మినహా అక్కడ ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. 9 పోలింగ్ సెంటర్లలో ఎన్నికలు జరిగాయి. భూపాలపల్లి డివిజన్‌లో మొత్తం 5410 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి మణుగూరు ఏరియాలో గుర్తింపు సంఘ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అధికారులు జిల్లాలో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. 2452 మంది కార్మికులు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
-
2023-12-27T18:05:46+05:30
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్‌ఎస్ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా చివరిలో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీకి బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ మద్ధతుని ప్రకటించింది. ఈ మేరకు సింగరేణి అంతటా టీబీజీకేఎస్ శ్రేణులు డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీ-ఐఎన్‌టీయూపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
-
2023-12-27T18:02:04+05:30
సాధారణ ఎన్నికలను తలపించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్నచిన్న ఘటనలు మినహా కార్మికులు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రికార్డు స్థాయిలో 96.3 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సింగరేణి ఎన్నికల బరిలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు పోటీ చేశాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. దీంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. గుర్తింపు పొందిన మొత్తం 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ప్రధానంగా 2 సంఘాల మధ్యే పోటీ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ రాత్రి 7 గంటలకు మొదలవనుండగా అర్ధ రాత్రి వరకు కొనసాగనుందని తెలుస్తోంది.