Home » Telangana Govt
Telangana: రైతుల బాగుకోసం ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉందని సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రైతులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. గతనెల 25వ తేది నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించామని.. 7149 కేంద్రాల్లో కలిపి 1.87 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు అత్యధికంగా నిజామాబాద్‌లో 1లక్ష ఎల్ఎంటీ, కామారెడ్డిలో 11వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కావాల్సిన యంత్రాలు సిద్ధం చేశామన్నారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పెను దుమారాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో స్పెషల్ పీపీని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గత నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసును పోలీసులు విచారిస్తున్నారు.
Telangana: తెలంగాణలో త్వరలో బీర్ల రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అందుకు గ్రేటర్లో తాగునీటి కొరతే కారణమా? డిమాండ్‌కు తగ్గట్లు బీర్లను బ్రూవరీలు సప్లై చేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా మందుబాబులకు చేదు వార్తనే చెప్పాలి..
Telangana: రాష్ట్రంలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాటర్ మేనేజ్మెంట్అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారులను సర్కార్ నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి పది జిల్లాలకు మొత్తం పది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రానున్న రెండు నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురిలో ఇద్దరు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు రాగా.. ఒకరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రెటరీగా శివలింగయ్య ఐఏఎస్ నియమితులయ్యారు.
Telangana: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
Telangana: రైతు నేస్తం పేరుతో ప్రతి రైతులతో నేరుగా మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త ప్రోగ్రాంకు నాంది పలికింది. రియల్ టైం సొల్యూషన్స్ త్రు డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రాజెక్టును వ్యవసాయ శాఖ రూపొందించింది. శాస్త్రవేత్తలు, అధికారులను అనుసంధానం చేసే విధంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు.
Telangana: ఎల్ఆర్ఎస్పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.
Telangana: గొర్రెల పథకం నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెలు,ఆవులు, బర్రెల స్కీంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్‌లో డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ కూడా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.