TS Govt: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Apr 12 , 2024 | 11:55 AM
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పెను దుమారాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో స్పెషల్ పీపీని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గత నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసును పోలీసులు విచారిస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ వ్యాప్తంగా పెను దుమారాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో స్పెషల్ పీపీని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గత నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావు (Radha Kishan Rao), మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు (Bhujangarao), తిరుపతన్న (Tirupatanna), మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులను (Praneet Rao) పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చూసేయండి..
ఈ క్రమంలో కోర్టులో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ప్రభుత్వం భావించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నెలరోజులు గడుస్తున్న ఈ కేసులో లభించింది కొన్ని ఆధారాలు మాత్రమే. ఈ క్రమంలో హై ప్రొఫైల్ కేసు కావడంతో కేవలం ఈ కేసు కోసం మాత్రమే ప్రత్యేక పీపీని ప్రభుత్వం నియమించింది. స్పెషల్ పీపీగా సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టులో కొత్త పీపీ నియామక ఉత్తర్వులను జతపరుస్తూ మెమో దాఖలు చేశారు.
సోమవారమే కోర్టులో వాదనలు...
మరోవైపు ఫోన్ టాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ ముగిసింది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న కోరారు. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. సోమవారం నాంపల్లి కోర్టులో తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌పైనా సోమవారమే కోర్టులో విచారణ జరుగనుంది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో అన్ని పిటిషన్లపై ఏప్రిల్ 15న (సోమవారం)నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది.
Film actress Gautami: సినీ నటి గౌతమి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే...
ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు...
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు పోలీసు అధికారులను విచారించగా.. ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లు తేలింది. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు విచారణలో రాజకీయ నాయకుల సంబంధించిన సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అలాగే మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ సమయంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ పూర్తవడంతో త్వరలోనే రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయా రాజకీయ నాయకులను అధికారులు విచారించనున్నారు. అయితే మొదట నోటీసు ఎవరికి ఇవ్వాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ వాదనలివే..
AP elections: విశాఖ సౌత్‌లో నెగ్గేదెవరు..?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...