Home » Telugu Desam Party
జగన్ ప్రభుత్వ అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరుతామని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. అధికారుల పనితీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే, ఉన్నత స్థాయికి చేరతారనిమంత్రి నారాయణ అన్నారు. ‘నేను 1972లో పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. నాలో కసి పెరిగి డిగ్రీ, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా తయారు అయ్యాను’’ అని మంత్రి నారాయణ గుర్తుచేసుకున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడుల, పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీస్తున్నారు.. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును ఎంతలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసే ఉంటారు. వైసీపీ నేతలను గుడివాడలో వరుస అరెస్ట్‌లు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే నీలి మీడియా చూసి ఓర్వలేకపోతుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆక్షేపించారు. ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక.. సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెటైర్లు కురిపించారు. జగన్‌కు లండన్ మందులు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన గొప్పలకు రూ.1300 కోట్లు ఖర్చు చేసిన దానికి సన్మానం చేయాలని విమర్శించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పేరుతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. బెల్టు షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
టీడీపీ బలోపేతానికి అన్ని ఆర్గనైజేషన్లలో పార్టీ నాయకత్వాన్ని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొత్త రికార్డుల దిశగా పరుగెడుతోంది. సోమవారం రాత్రికి ఆ పార్టీ సభ్యత్వం 50 లక్షల మార్కును దాటేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన 29 రోజుల్లోనే అర కోటి రికార్డును ఆ పార్టీ శ్రేణులు అధిగమించడం విశేషం.
దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇది కలియుగం... కర్మ ఫలం ఎవరినీ వదలదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ జన్మలో చేసిన పాపాలకు కర్మ ఫలం ఈ రోజుల్లోనే అనుభవించే రోజులు వచ్చాయని హెచ్చరించారు.