Share News

YS Sharmila: సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ..ఎందుకంటే..

ABN , Publish Date - Nov 25 , 2024 | 05:51 PM

దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

YS Sharmila: సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ..ఎందుకంటే..

అమరావతి: తెలుగు ప్రజల మనోభావాలను మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దెబ్బ తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. లంచాల కోసం ఏపీని జగన్ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ, జగన్ మోహన్ రెడ్డి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకొనే భారీ కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని వైఎస్ షర్మిల అన్నారు.


ఇవాళ(సోమవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. అదానీతో జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందంతో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం లక్షా 50 వేల కోట్లు రూపాయలు... కాబట్టి వెంటనే డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయని వైఎస్ షర్మిల గుర్తుచేశారు.


స్కీంల కోసం స్కాంలకు పాల్పడ్డట్లు ఆధారాలు సైతం చూపించాయని చెప్పారు. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆండ్ కో కి రూ.1750కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్టులో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ధ్వజమెత్తారు. ఇటువంటి ఒప్పందాలపై విచారణ చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. జగన్ అవినీతి కారణంగా ప్రజలపై పడిన భారాల ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని వైఎస్ షర్మిల కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఏపీ విద్యుత్ శాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP NEWS: చెవిరెడ్డి నువ్వో చీటర్...బాలినేని సంచలన కామెంట్స్

AP NEWS:అదానీ స్కాంలో.. జగన్‌పై గోనే ప్రకాశరావు సంచలన ఆరోపణలు

Kollu Ravindra: వైసీపీలో వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు... మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

Read Latest AP News and Telugu News

Updated Date - Nov 25 , 2024 | 05:54 PM