Minister Ram Prasad Reddy:వారి నుంచి అణాపైసలతో సహా రాబడుతాం.. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వార్నింగ్
ABN , Publish Date - Dec 08 , 2024 | 05:04 PM
జగన్ ప్రభుత్వ అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరుతామని చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. అధికారుల పనితీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
చిత్తూరు: వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దోచుకున్న వారి నుంచి అణా పైసలతో సహా రాబడతామని చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నేతలు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరుతామని అన్నారు. అధికారుల పనితీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం(Drc) ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారుల తీరుపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. విద్యాశాఖ ప్రోటోకాల్ పాటించడం లేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు కనీసం పరిగణనలోకి తీసుకోవడంలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. వైసీపీ పాలనలో ప్రజా ప్రతినిధులకు అణిగిమణిగి ఉన్న అధికారులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకింత మార్పు అంటూ సూటిగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా అధికారులు పనితీరు మార్చుకోవాలని మంత్రి హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీ దగ్గు మల్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, థామస్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు.
వైసీపీ నేతలకు సవాల్ విసిరిన వర్మ
కాకినాడ జిల్లా: కాకినాడ ఎస్‌ఈజడ్ భూదోపిడీపై నిజాలు నిగ్గు తేల్చాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. సీబీఐ, ఈడీ సంస్థల విచారణ కోరుతున్న వైసీపీ నేతలు దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి విచారణకైనా టీడీపీ ఎప్పుడు సిద్ధమేనని సవాల్ విసిరారు. పిఠాపురం నడిబొడ్డున ఎస్ఈజడ్ భూ దోపిడీపై చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. తాము అన్ని పత్రాలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని, వైసీపీ నేతలు పిఠాపురం ఉప్పాడ బస్టాండులో చర్చకు రావాలని అన్నారు. ఎస్ఈజడ్ వ్యవహారంలో రైతులను నిలువునా ముంచింది మాజీ ముఖ్యమంత్రి,, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. వైసీపీ నేతలు నేరుగా రైతుల భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. కేవలం పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ నాటకాలు ఆడుతోందని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్సార్‌సీపీ పాపాల చిట్టా రెడి..
బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News