Home » Telugu Desam Party
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలని.. జగన్‌ను త్వరగా అమెరికా లాక్కెళ్లాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు చేశారు. తాను అవినీతి చేయలేదని జగన్ అంటున్నారని... తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ని అమెరికాకు పంపాలని సవాల్ విసిరారు.
వైసీపీ అధినేత జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేరని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బతీశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని చంద్రబాబు విమర్శలు చేశారు.
కూటమి ప్రభుత్వం తనపై కక్ష గట్టిందని నంగనాచి కబుర్లు చెబుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసు అధికారులపై డీజీపీ వెంటనే కేసు రిజిస్టర్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్కు సంబంధించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఐదేళ్లలో టిడ్కో ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు చాలా నష్టం జరిగిందని ఆరోపించారు.
రఘురామ ఏదైనా ఫ్రాంక్‌గా మాట్లాడతారని.. ఆయనకు కల్మషం ఉండదు ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్లుగా రఘురామ చెబుతారని.. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిందని రఘురామ గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి జగన్ మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అధికారం కోసం జగన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ... రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. గతంలో క్యాబినెట్ సమావేశాలు కానీ, సచివాలయానికి వచ్చిన దాఖలాలు కానీ జగన్‌కు లేవని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.
చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 17 ఏళ్ల క్రితం విజయవాడలో ప్రారంభమైన పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్.. ఏపీవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు.